ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- July 13, 2026
దోహా: ఖతార్ ఫాదర్ అమీర్, హిజ్ హైనెస్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ మరణం పట్ల ప్రపంచ దేశాలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశాయి. ఖతార్‌లోని పలు దేశాల రాయబార కార్యాలయాలు, రాయబారులు తమ సంతాప సందేశాలను విడుదల చేశాయి. ఆధునిక ఖతార్ నిర్మాణంలో ఆయన పాత్ర మరువలేనిదని, దేశాన్ని ప్రపంచ వేదికపై అగ్రస్థానానికి తీసుకెళ్లిన గొప్ప రాజనీతిజ్ఞుడిగా అభివర్ణించారు.
సౌదీ అరేబియా, ఒమాన్, అమెరికా, టర్కీయే, ఈజిప్ట్, భారత్, బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా, నెదర్లాండ్స్, స్పెయిన్, పోర్చుగల్, స్విట్జర్లాండ్, స్వీడన్, ఉక్రెయిన్, సింగపూర్, మెక్సికో, కొలంబియా, ఫిన్లాండ్, గ్రీస్, పోలాండ్, హంగేరీ, మాల్టా, థాయ్‌లాండ్, ఉజ్బెకిస్తాన్, వెనిజులా తదితర దేశాల రాయబార కార్యాలయాలు తమ ప్రగాఢ సానుభూతిని ప్రకటించాయి.
ఫాదర్ అమీర్ నాయకత్వంలో ఖతార్ ఆర్థిక, విద్య, క్రీడలు, మౌలిక వసతులు, దౌత్య రంగాల్లో విశేష ప్రగతి సాధించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని అన్ని దేశాలు పేర్కొన్నాయి.
ఫాదర్ అమీర్ దూరదృష్టి, ప్రగతిశీల విధానాల వల్లే ఖతార్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించిందని భారత్ రాయబారి విపుల్ అన్నారు. ఇంధన రంగంతో పాటు విద్య, సంస్కృతి, క్రీడలు, మానవ వనరుల అభివృద్ధిలో ఆయన అందించిన నాయకత్వం చిరస్మరణీయమని పేర్కొన్నారు.
టర్కీయే రాయబారి డా. ముస్తఫా గోక్సు, ఫ్రాన్స్ రాయబారి ఆర్నాడ్ పెషో, పాకిస్థాన్ రాయబారి మహమ్మద్ ఆమిర్ సహా పలువురు రాయబారులు ఫాదర్ అమీర్‌ను చరిత్రలో నిలిచిపోయే మహానాయకుడిగా అభివర్ణించారు. ప్రాంతీయ శాంతి, అంతర్జాతీయ సహకారం, అభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్థాయిగా నిలిచిపోతుందని నివాళులర్పించారు.
ప్రపంచ దేశాల నుంచి వెల్లువెత్తిన ఈ సంతాప సందేశాలు ఫాదర్ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీకి అంతర్జాతీయ స్థాయిలో ఉన్న గౌరవాన్ని మరోసారి చాటిచెప్పాయి.
తాజా వార్తలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్‌ఫామ్‌కు నష్టం: కువైట్
- వేసవి సెలవుల్లో ట్రాఫిక్‌కు బ్రేక్.. ఏడాది పొడవునా సాధ్యమేనా?
- బహ్రెయిన్‌లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- కువైట్‌లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!







