గల్ఫ్ కు వెళ్లిన సదరు మహిళకు అక్కడి దుర్భర జీవనం..

- August 13, 2016 , by Maagulf
గల్ఫ్ కు వెళ్లిన సదరు మహిళకు అక్కడి దుర్భర జీవనం..

హైదరాబాద్ నగరానికి చెందిన 30 ఏళ్ల ఓ మహిళ పొట్ట కూటి కోసం విదేశాల్లో ఇంటి పనిమనిషిగా పనిచేసేందుకు ఏజెంటు ద్వారా గల్ఫ్ దేశమైన దుబాయ్ కు పయనమైంది...అలా వెళ్లిన ఆ మహిళను సాక్షాత్తు పనిలో పెట్టుకున్న యజమానే లైంగికంగా వేధించడం ఆరంభించాడు...కొట్టడంతోపాటు భోజనం పెట్టకుండా గదిలో నిర్భందించాడు. అక్కడి నుంచి ఆమెను మస్కట్ కు తీసుకువెళ్లి వ్యభిచారం వృత్తిలో దించాడు... ఇంటిపనిచేసి సంపాదించి కుటుంబానికి ఆసరాగా నిలుద్దామని గల్ఫ్ కు వెళ్లిన సదరు మహిళకు అక్కడి దుర్భర జీవనంతో విసిగివేసారి మన భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించింది. అంతే మన రాయబార కార్యాలయ అధికారులు స్పందించి బాధిత మహిళను వ్యభిచార కూపం నుంచి రక్షించి స్వదేశానికి తరలించారు. ఇలాంటి సంఘటనలు గల్ఫ్ దేశాల్లో ఒకటి కాదు రెండు కాదు ప్రతినిత్యం సాగుతున్నాయి.ఇంటి పనిమనుషుల పేరిట గల్ఫ్ కు అమ్మాయిల అక్రమ రవాణా చేయడానికి తాజా కేంద్ర నిర్ణయంతో తెరపడనుంది.మహిళా ఇంటిపనిమనుషుల గల్ఫ్ రిక్రూట్ మెంట్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రిక్రూటింగ్ ఏజెన్సీల ద్వారానే చేయాలని తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మహిళల అక్రమ రవాణాపై వచ్చిన ఫిర్యాదులపై స్పందించిన కేంద్రం ఇకపై ప్రైవేటు ఏజెంట్ల ద్వారా ఇంటి పనిమనుషుల రిక్రూట్ మెంట్ చేయడానికి వీల్లేకుండా నిషేధం విధించింది. 18 దేశాలకు వెళ్లే ఇంటి పనిమనుషుల రిక్రూట్ మెంట్ ఇకనుంచి ప్రభుత్వం ఆధీనంలోని ఆరు ఏజెన్సీలు మాత్రమే చేస్తాయని రూట్స్ అండ్ ఓవర్ సీస్ డెవలప్ మెంట్ ఎంప్లాయ్ మెంట్ ప్రమోషన్ కార్యదర్శి ఉషా టిటూస్ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com