సౌదీలో విజిట్ వీసా గడువు దాటితే 50 వేల రియాల్స్ ఫైన్, జైలుశిక్ష..!!
- July 14, 2026
రియాద్: సౌదీ అరేబియాలో ప్రవేశ వీసా (ఎంట్రీ వీసా) గడువు ముగిసిన తర్వాత కూడా దేశంలోనే ఉండే విదేశీయులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. వీసా గడువు ముగిసిన తర్వాత దేశం విడిచి వెళ్లని వారికి గరిష్ఠంగా 50,000 సౌదీ రియాల్స్ జరిమానా, ఆరు నెలల వరకు జైలు శిక్ష, అనంతరం దేశం నుంచి బహిష్కరణ (డిపోర్టేషన్) విధిస్తామని స్పష్టం చేసింది.
అలాగే నివాస, కార్మిక, సరిహద్దు భద్రత నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు అధికారులకు అందించాలని మంత్రిత్వ శాఖ కోరింది. మక్కా, మదీనా, రియాద్, తూర్పు ప్రావిన్స్‌లలో 911కు, రాజ్యంలోని ఇతర ప్రాంతాల్లో 999కు ఫోన్ చేసి ఫిర్యాదులు నమోదు చేయాలని సూచించింది. వీసా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, గడువు ముగిసేలోపే దేశం విడిచి వెళ్లాలని లేదా చట్టబద్ధంగా వీసాను పొడిగించుకోవాలని విదేశీయులకు సౌదీ అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..
- ఏపీ విద్యార్థులకు అలర్ట్..
- సూసైడ్ నోట్లో 4 పేర్లు.. కేసులో సంచలన మలుపు!
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన నాలుగు ఇరానియన్ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- బహ్రెయిన్‌లో అత్యవసర సైరన్లు మోగింపు..
- రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం రేవంత్ కీలక నిర్ణయం
- హోర్ముజ్ జలసంధిలో యూఏఈకి చెందిన రెండు ట్యాంకర్ల పై క్షిపణి దాడి..
- మిడిలీస్టు ఉద్రిక్తతలతో చమురు ధరలు పెరుగుదల..గోల్డ్ ధరలు తగ్గుదల..!!
- ఖతార్ లో కార్మిక మంత్రిత్వ శాఖ ఈ-సేవలు కొనసాగింపు..!!
- కుటుంబ సభ్యుల పుట్టిన తేదీలతో.. Dh30 మిలియన్ల జాక్‌పాట్ కొట్టిన భారతీయ ప్రవాసి..!!







