కువైట్‌లో ప్రైవేట్ ఆస్పత్రుల్లో నగదు చెల్లింపులపై కొత్త నిబంధనలు..!!
- July 14, 2026
కువైట్: కువైట్‌లోని ప్రైవేట్ ఆరోగ్య సేవల సంస్థల్లో 10 కువైటీ దినార్ (KD10) కంటే ఎక్కువ మొత్తాన్ని నగదుగా స్వీకరించడాన్ని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ నిషేధించింది. ఈ నిర్ణయం సోమవారం నుంచి అమల్లోకి వచ్చిందని పేర్కొంది.
కొత్త నిబంధనల ప్రకారం, ఆరోగ్య మంత్రిత్వ శాఖ లైసెన్స్ పొందిన ప్రైవేట్ ఆస్పత్రులు, వైద్య కేంద్రాలు, క్లినిక్‌లు, హోమ్ హెల్త్‌కేర్ సేవల సంస్థలు, ఇతర ప్రైవేట్ వైద్య సంస్థలు KD10 కంటే ఎక్కువ మొత్తాన్ని తప్పనిసరిగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ ఆమోదించిన బ్యాంకింగ్ లేదా ఎలక్ట్రానిక్ చెల్లింపు విధానాల ద్వారానే స్వీకరించాలి. ఈ నిబంధనలను ఉల్లంఘించిన సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
నిబంధనలను పాటించని వైద్య సంస్థలను మూసివేయడంతో పాటు, చట్టపరమైన చర్యల కోసం సంబంధిత దర్యాప్తు అధికారులకు అప్పగిస్తామని తెలిపింది.ప్రైవేట్ ఆరోగ్య రంగంలో ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకతను పెంచడం, సురక్షితమైన డిజిటల్ చెల్లింపు విధానాలను ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..
- ఏపీ విద్యార్థులకు అలర్ట్..
- సూసైడ్ నోట్లో 4 పేర్లు.. కేసులో సంచలన మలుపు!
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన నాలుగు ఇరానియన్ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- బహ్రెయిన్‌లో అత్యవసర సైరన్లు మోగింపు..
- రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం రేవంత్ కీలక నిర్ణయం
- హోర్ముజ్ జలసంధిలో యూఏఈకి చెందిన రెండు ట్యాంకర్ల పై క్షిపణి దాడి..
- మిడిలీస్టు ఉద్రిక్తతలతో చమురు ధరలు పెరుగుదల..గోల్డ్ ధరలు తగ్గుదల..!!
- ఖతార్ లో కార్మిక మంత్రిత్వ శాఖ ఈ-సేవలు కొనసాగింపు..!!
- కుటుంబ సభ్యుల పుట్టిన తేదీలతో.. Dh30 మిలియన్ల జాక్‌పాట్ కొట్టిన భారతీయ ప్రవాసి..!!







