కువైట్ చమురు క్షేత్రంపై దాడి.. పరామర్శించిన మినిస్టర్..!!
- July 15, 2026
కువైట్ సిటీ: కువైట్ ఆయిల్ కంపెనీ (KOC)కి చెందిన ఒక ఆఫ్-షోర్ చమురు క్షేత్రంపై ఇటీవల జరిగిన దాడిలో గాయపడిన ఉద్యోగిని చమురు శాఖ మంత్రి తారిఖ్ అల్-రౌమీ పరామర్శించారు. అల్-అదాన్ ఆసుపత్రికి వెళ్లిన మంత్రి, చికిత్స పొందుతున్న సదరు కార్మికుడి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మంత్రితో పాటు కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ (KPC) అధికారులు ఉన్నారు. గత ఆదివారం జరిగిన ఈ దాడిలో, KOC అనుబంధ చమురు సేవల సంస్థలో పనిచేస్తున్న మహ్మద్ అబ్దుల్ మొహ్సేన్ సులేమాన్ అనే కార్మికుడు గాయపడ్డారు.
ఈ సందర్భంగా చమురు క్షేత్రంపై జరిగిన దాడిని మంత్రి తీవ్రంగా ఖండించారు. కువైట్ దేశాన్ని లక్ష్యంగా చేసుకుని ఇటీవల జరుగుతున్న వరుస దాడుల్లో భాగంగానే ఈ ఘటన చోటుచేసుకుందని ఆయన పేర్కొన్నారు. దేశ చమురు రంగంలో పనిచేసే ఉద్యోగుల రక్షణకే తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తామని మంత్రి అల్-రౌమీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







