సెప్టెంబర్ తో ముగియనున్న దుబాయ్ మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్..!!
- July 15, 2026
దుబాయ్: ప్రపంచ ప్రసిద్ధ దుబాయ్ 'మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్' (Museum of the Future) ప్రస్తుత ప్రదర్శన (Exhibition) ఈ ఏడాది సెప్టెంబర్ తో ముగియనుంది. ఈ మేరకు మ్యూజియం యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. 2027లో ఆవిష్కరించబోయే "నెక్స్ట్ జనరేషన్" సరికొత్త ప్రదర్శనల కోసం పనులు ప్రారంభించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ప్రజలు పంపిన వినూత్న ఆలోచనలు, సూచనల ఆధారంగా ఈ భవిష్యత్తు ప్రదర్శనలను రూపొందించనున్నారు.
మ్యూజియం తదుపరి తరం ఇంటరాక్టివ్ అనుభవాలను తీర్చిదిద్దేందుకు గాను సాధారణ ప్రజల నుండి సలహాలను ఆహ్వానిస్తూ ఇటీవల ఒక ప్రకటన విడుదల చేసింది. దీనికి స్పందనగా మ్యూజియం సాషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా 1,000కి పైగా అద్భుతమైన ఆలోచనలు, ప్రతిపాదనలు వచ్చాయి. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ కొత్త ప్రదర్శనలు.. రాబోయే దశాబ్దాలలో ఎదురయ్యే సవాళ్లు, అవకాశాలను సందర్శకులు మరింత లోతుగా, ఇంటరాక్టివ్ పద్ధతిలో అందించేలా డిజైన్ చేయనున్నట్లు మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్ చైర్మన్ మహ్మద్ అల్ గెర్గావి గతంలో వెల్లడించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







