పీసా టవర్‌పై దాడి చేసేందుకు కుట్ర
- August 13, 2016
ప్రపంచ వింతల్లో ఒకటైన 'లీనింగ్ టవర్ ఆఫ్ పీసా'పై ఉగ్రవాదులు దాడి చేయాలని కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఇటలీలోని ప్రఖ్యాత పీసా టవర్‌కు వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఈ కట్టడం ఓ పక్కకు ఒరిగి పడిపోకుండా ఉన్నందున ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి సాధించిన సంగతి తెలిసిందే. ఇక్కడికి అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఇటీవల ఇటలీలో బైలెల్ చియహోయి అనే 26ఏళ్ల ట్యునీషియన్ వ్యక్తి యూరప్‌లో జరిగిన ఉగ్రవాద దాడులను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేశాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. విచారణలో అతడు పీసా టవర్‌పై దాడి చేసేందుకు కుట్ర పన్నినట్లు వెల్లడైందని అక్కడి మీడియా వెల్లడించింది.ఈ ట్యునీషియన్ దేశస్థుడిని వెంటనే ఇటలీ నుంచి బహిష్కరించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అందుకు సంబంధించిన పత్రాలపై న్యాయమూర్తి కూడా సంతకం చేసినట్లు పోలీసులు తెలిపారు. కానీ అతడు ఇటలీలో దాడులకు కుట్ర చేశాడనే అంశానికి సంబంధించి పోలీసులు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఇటీవల ఫ్రాన్స్, బెల్జియం దేశాల్లో ఉగ్రదాడులు జరిగిన నేపథ్యంలో ఇటలీలో దాడులు జరిగే అవకాశం ఉండొచ్చని అధికారులు అప్రమత్తంగా ఉంటున్నారు. ఇటలీ అంతర్గత మంత్రి ఆంజెలినో అల్ఫానో ఆదేశాల మేరకు ట్యునీషియన్ వ్యక్తిని దేశ బహిష్కరణ చేశారు.
తాజా వార్తలు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు







