భారతీయ నావికులను పరామర్శించిన దుబాయ్ భారత కాన్సులేట్ అధికారులు..!!
- July 16, 2026
దుబాయ్:హోర్ముజ్ జలసంధిలో జరిగిన దాడిలో గాయపడిన భారతీయ నావికులను దుబాయ్‌లోని భారత కాన్సులేట్ అధికారులు పరామర్శించారు. యూఏఈలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. జూలై 14 రాత్రి ఎమ్‌టీ అల్ బహియాహ్ మరియు ఎమ్‌టీ మొంబాసా వాణిజ్య ట్యాంకర్ల నుంచి తరలించిన భారతీయ సిబ్బందిని అధికారులు కలిశారు. అలాగే దిబ్బా, ఖోర్‌ఫక్కాన్, ఫుజైరా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న గాయపడిన నావికులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
హోర్ముజ్ జలసంధిలో ఒమాన్ ప్రాదేశిక జలాల సమీపంలో ప్రయాణిస్తున్న రెండు ట్యాంకర్లపై క్షిపణి దాడి జరగడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒక భారతీయ నావికుడు మృతి చెందగా, మొత్తం ఎనిమిది మంది సిబ్బంది గాయపడ్డారు. వారిలో నలుగురు భారతీయులు, ఇద్దరు ఉక్రెయిన్ పౌరులు ఉండగా, నలుగురి పరిస్థితి తీవ్రంగా ఉంది. గాయపడిన భారతీయ నావికులకు అవసరమైన అన్ని విధాల సహాయం అందించేందుకు కాన్సులేట్ అధికారులు ఆసుపత్రులు, నౌక నిర్వహణ సంస్థ, యూఏఈ అధికార యంత్రాంగం, బాధితుల కుటుంబాలతో నిరంతరం సమన్వయం కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఈ దాడిని యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండిస్తూ, మృతి చెందిన భారతీయ నావికుడి కుటుంబానికి, భారత ప్రభుత్వానికి సంతాపం తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







