'అభినేత్రి' అక్టోబరు 7న విడుదల..

- August 13, 2016 , by Maagulf
'అభినేత్రి'  అక్టోబరు 7న విడుదల..

ప్రభుదేవా, తమన్నా కీలక పాత్రల్లో నటించిన 'అభినేత్రి' చిత్రం హృదయాలను దోచుకోవడానికి వచ్చేస్తోందని నిర్మాత, రచయిత కోనా వెంకట్‌ అన్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా అక్టోబరు 7న విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ కోనా తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్టర్‌ను పోస్ట్‌ చేశారు. ఎ.ఎల్‌. విజయ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రభుదేవా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సోనూసూద్‌, అమీ జాక్సన్‌ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. జి.వి. ప్రకాశ్‌కుమార్‌, సాజిద్‌-వాజిద్‌, విశాల్‌ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com