జర్మనీలో ఉద్యోగాలకు టామ్‌కామ్ నోటిఫికేషన్..
- July 17, 2026
హైదరాబాద్: తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM) జర్మనీలో ఫిజియోథెరపిస్టులు, ఆక్యుపేషనల్ థెరపిస్టుల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది.
టామ్‌కామ్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఫిజియోథెరపిస్ట్ మరియు ఆక్యుపేషనల్ థెరపిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి డీపీటీ (DPT), బీపీటీ (BPT), ఎంఫీటీ (MPT) లేదా బీఎస్సీ (ఆక్యుపేషనల్ థెరపీ) పూర్తి చేసి ఉండాలి. రిజిస్ట్రేషన్ అనంతరం కనీసం ఒక సంవత్సరం నిరంతర వృత్తిపరమైన అనుభవం ఉండటం తప్పనిసరి. అభ్యర్థుల వయస్సు 43 సంవత్సరాల లోపు ఉండాలని, జర్మన్ భాషలో బీ2 (B2) స్థాయి సర్టిఫికేట్ కలిగి ఉండాలని సంస్థ పేర్కొంది.
ఎంపికైన అభ్యర్థులకు జర్మన్ లైసెన్స్ వచ్చే వరకు నెలకు €2,500 నుంచి €2,900 (సుమారు రూ.2.68 లక్షల నుంచి రూ.3.11 లక్షలు) వేతనం అందించనున్నారు. లైసెన్స్ పొందిన తర్వాత నెలకు €2,800 నుంచి €3,500 (సుమారు రూ.3.00 లక్షల నుంచి రూ.3.75 లక్షలు) వరకు జీతం చెల్లించనున్నారు.
అదనంగా ప్రతి ఏడాది 25 నుంచి 30 రోజుల వార్షిక సెలవులు మరియు యాజమాన్యం తరఫున ఉచిత ఆరోగ్య బీమా (హెల్త్ ఇన్సూరెన్స్) వంటి సౌకర్యాలు కల్పించనున్నట్లు టామ్‌కామ్ తెలిపింది.
ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు తమ బయోడేటాను [email protected] ఇమెయిల్‌కు పంపవచ్చు. అలాగే https://forms.gle/CQFAdQFgGFb7FuVU9 లింక్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది.
మరిన్ని వివరాల కోసం 9440049645, 9440051763, 9440052592, 9440052081 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చని తెలిపింది. పూర్తి సమాచారం కోసం టామ్‌కామ్ అధికారిక వెబ్సైట్ https://tomcom.telangana.gov.inను సందర్శించాలని సంస్థ సూచించింది.

తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో బోట్స్ రాకపోకలపై నిషేధం పొడిగింపు..!!
- సేఫ్ సిటీ ప్రాజెక్టు పై ఉన్నతస్థాయి సమీక్షించిన డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణలో మద్యం ధరల భారీ పెంపు
- కువైట్ పై మళ్లీ దాడులు..అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థ..!!
- వరల్డ్ కప్ ట్రోఫీ గెలిచిన జట్టుకు మరో అరుదైన గౌరవం
- ధోఫార్‌లో టూరిజానికి బూస్ట్.. ‘యోర్ పాత్ ఈజ్ గ్రీన్’ కు శ్రీకారం..!!
- సౌదీలో పీక్ సమ్మర్ పీరియడ్ ప్రారంభం..హెచ్చరికలు జారీ..!!
- విదేశాలకు వెళ్తున్నారా? ఈ కాఫ్ సిరఫ్ తీసుకెళితే అరెస్టు కావచ్చు..!!
- ఖతార్ పై వైమానిక దాడుల యత్నం..
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్ట్ సేవల్లో మార్పులు..







