230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!

- July 17, 2026 , by Maagulf
230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!

దుబాయ్: ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ గంటకు 230 కిలోమీటర్లకు పైగా వేగంతో కారు నడిపిన ఓ డ్రైవర్‌ను దుబాయ్ పోలీసులు పట్టుకున్నారు. స్మార్ట్ నిఘా వ్యవస్థల నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో అతడు ఉద్దేశపూర్వకంగా వాహనం నంబర్ ప్లేట్లను తొలగించి రోడ్లపై ప్రయాణించినట్లు పోలీసులు వెల్లడించారు.

అయితే దుబాయ్ పోలీసుల సాంకేతిక నిఘా వ్యవస్థల సహాయంతో నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతని వాహనాన్ని స్వాధీనం (ఇంపౌండ్) చేసుకుని 50,000 దిర్హామ్‌ల జరిమానా విధించారు.

ట్రాఫిక్ భద్రతకు ముప్పు కలిగించే విధంగా అతివేగంగా వాహనాలు నడపడం, నంబర్ ప్లేట్లను తొలగించడం వంటి చర్యలపై కఠిన చర్యలు తప్పవని దుబాయ్ పోలీసులు హెచ్చరించారు. రహదారులపై ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com