కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- July 19, 2026
కువైట్ సిటీ: అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో విద్యుత్ పొదుపు కోసం చేపట్టిన ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని కువైట్ విద్యుత్, వాటర్ మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ తెలిపింది. పౌరులు, ప్రవాసులు కలిసి విద్యుత్ వినియోగాన్ని తగ్గించడంతో దేశ విద్యుత్ గ్రిడ్ స్థిరంగా కొనసాగిందని పేర్కొంది. మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఇంజినీర్ ఫాతిమా హయాత్ మాట్లాడుతూ. విద్యుత్ పొదుపు అవగాహన సందేశాలను సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్‌ల ద్వారా విస్తృతంగా ప్రచారం చేసిన పౌరులు, ప్రవాసులు, ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలు, మీడియా సంస్థలు, ప్రైవేట్ రంగ ప్రతినిధులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
జూలై 17, 18 తేదీల్లో మంత్రిత్వ శాఖ విడుదల చేసిన విద్యుత్ పొదుపు సందేశాలు వేగంగా ప్రజలకు చేరడంతో అవగాహన పెరిగిందని, క్లిష్ట పరిస్థితుల్లో జాతీయ ఐక్యతను ప్రజలు చాటుకున్నారని ఆమె అన్నారు. గత రెండు రోజులుగా ప్రజలు విద్యుత్ వినియోగాన్ని తగ్గించడంతో అంచనాల కంటే విద్యుత్ డిమాండ్ తగ్గిందని, దీంతో సాంకేతిక బృందాలు జాతీయ విద్యుత్ గ్రిడ్‌ను స్థిరంగా నిర్వహించడంతో పాటు విద్యుత్, నీటి సరఫరాలో అంతరాయం లేకుండా సేవలు అందించగలిగాయని ఫాతిమా హయాత్ తెలిపారు.
విద్యుత్ పొదుపును ప్రతి ఒక్కరి జాతీయ బాధ్యతగా భావించి ఇదే సహకారాన్ని కొనసాగించాలని మంత్రిత్వ శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. విద్యుత్‌ను పొదుపుగా వినియోగించడం ద్వారా దేశ వనరులను సంరక్షించడంతో పాటు విద్యుత్, నీటి వ్యవస్థల స్థిరత్వం, కీలక సేవల నిరంతరతకు తోడ్పడుతుందని పేర్కొంది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







