ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- July 19, 2026
మస్కట్: ఒమాన్‌లోని ధోఫార్ గవర్నరేట్ నుంచి తిరుగు ప్రయాణంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ ఉపాధ్యాయురాలు, ఆమె ముగ్గురు పిల్లలు మృతి చెందారు. ఈ విషాద ఘటన దక్షిణ అల్ షర్కియాహ్ ప్రాంత ప్రజలను, విద్యా వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతుల్లో ఉపాధ్యాయురాలితో పాటు ఆమె ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఈ విషాద వార్తతో సహచర ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానికులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
జలాన్ బని బు అలీ ప్రాంతంలోని దౌహత్ అల్ ఇల్మ్ స్కూల్ యాజమాన్యం, సిబ్బంది విడుదల చేసిన ప్రకటనలో ఆమెకు ఘన నివాళి అర్పించారు. రెండు దశాబ్దాలకు పైగా విద్యార్థులకు అంకితభావంతో బోధించిన ఆదర్శ ఉపాధ్యాయురాలిగా ఆమెను కొనియాడారు. ఈ ప్రమాదం నేపథ్యంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యం ప్రసాదించాలని పలువురు ప్రార్థిస్తున్నారు.
ఖరీఫ్ పర్యాటక సీజన్లో ధోఫార్‌కు పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రయాణిస్తుండటంతో రహదారి భద్రతపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని అధికారులు మరోసారి గుర్తు చేశారు. అలసటతో వాహనాలు నడపకుండా, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని వాహనదారులకు సూచించారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







