సౌదీలో గృహ కార్మికుల ఇకామా రెన్యూవల్‌కు కొత్త విధానం..!!
- July 20, 2026
రియాద్: సౌదీ అరేబియా ప్రభుత్వం డొమెస్టిక్ వర్కర్స్ కోసం ఇకామా (రెసిడెన్సీ పర్మిట్) రెన్యూవల్ విధానంలో కీలక మార్పులు చేసింది. ఇకపై యజమానులు 3 నెలల నుంచే ఇకామాను జారీ చేయడం లేదా పునరుద్ధరించడం చేసుకునే సౌకర్యాన్ని కల్పించింది. సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of Interior).. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ (జవాజాత్), మానవ వనరులు మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ముసానెడ్ ప్లాట్‌ఫామ్‌ల సహకారంతో ఈ కొత్త సేవను ప్రారంభించింది.
కొత్త నిబంధనల ప్రకారం గృహ కార్మికుల ఇకామాను 3, 6, 9, 12, 15, 18, 21 లేదా 24 నెలల కాలానికి జారీ చేయవచ్చు లేదా రెన్యూవల్ చేసుకోవచ్చు. గతంలో మాత్రం 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాల కాలానికే రెన్యూవల్ అవకాశం ఉండేది. అలాగే, యజమానులు ఎంచుకున్న కాలానికి మాత్రమే ఇకామా ఫీజు చెల్లించే వెసులుబాటు కల్పించారు. దీంతో 3 నెలలు లేదా 3 నెలల గుణితకాలానికి రెన్యూవల్ చేస్తే క్వార్టల్లీ ప్రాతిపదికన ఫీజులు చెల్లించవచ్చు. ఈ నిర్ణయంతో యజమానులపై ఒకేసారి పడే ఆర్థిక భారం తగ్గడంతో పాటు, వారి అవసరాలకు అనుగుణంగా మరింత సౌలభ్యం లభిస్తుందని సౌదీ ప్రభుత్వం తెలిపింది. డిజిటల్ సేవలను విస్తరించడం, ప్రభుత్వ సేవలను మరింత సమర్థవంతంగా అందించడం లక్ష్యంగా ఈ మార్పులు తీసుకొచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్‌లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







