దుబాయ్‌లో వాకింగ్, సైక్లింగ్‌కు పెద్దపీట.. 25 ప్రాంతాల కనెక్ట్ కు కొత్త ప్రణాళిక..!!
- July 20, 2026
దుబాయ్: దుబాయ్‌లో ప్రజా రవాణాను మరింత సులభతరం చేసేందుకు రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఐదేళ్లలో 25 నివాస ప్రాంతాలను వాకింగ్ రూట్స్, సైక్లింగ్ ట్రాక్‌లు, ఈ-స్కూటర్ మార్గాలతో అనుసంధానించే ప్రణాళికకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు ద్వారా 2030 నాటికి 25 నివాస ప్రాంతాల్లో సాఫ్ట్ మొబిలిటీ మౌలిక వసతులు అభివృద్ధి చేయడంతో పాటు 63 మెట్రో, బస్ స్టేషన్ల పరిసరాలను కూడా ఆధునీకరించనున్నారు. దీంతో ప్రజలు ఇంటి నుంచి స్టేషన్ వరకు, స్టేషన్ నుంచి గమ్యస్థానానికి నడిచి, సైకిల్ లేదా ఈ-స్కూటర్‌పై సురక్షితంగా చేరుకునే అవకాశం కలుగుతుంది. ప్రస్తుతం దుబాయ్ మెరీనా, నైఫ్, అల్ రిగ్గా, అల్ మురార్, అల్ మురక్కబాత్ ప్రాంతాల్లో వాకింగ్ రూట్స్, సైక్లింగ్ ట్రాక్‌ల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.
కొత్త ప్రణాళికలో భాగంగా విశాలమైన ఫుట్‌పాత్‌లు, ప్రత్యేక సైక్లింగ్ ట్రాక్‌లు, నీడనిచ్చే వాక్‌వేలు, సురక్షిత పాదచారుల క్రాసింగ్‌లు, సైకిల్ పార్కింగ్, ప్రయాణికుల పికప్, డ్రాప్ సదుపాయాలు, కరీమ్ బైక్, ఈ-స్కూటర్ వంటి షేర్డ్ మొబిలిటీ సేవలకు ప్రత్యేక స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. RTA డైరెక్టర్ జనరల్ మత్తర్ అల్ తాయర్ మాట్లాడుతూ.. దుబాయ్‌ను ప్రపంచంలోనే అత్యుత్తమ నివాస నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ ప్రణాళికను అమలు చేస్తున్నట్లు తెలిపారు. వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి, ప్రజలు ప్రజా రవాణాను ఎక్కువగా ఉపయోగించేలా చేయడమే ప్రధాన ఉద్దేశమన్నారు.
2025లో దుబాయ్‌లో 34.2 కోట్ల పెడెస్ట్రీయన్ జర్నీలు, 5.73 కోట్ల సైక్లింగ్ ట్రిప్స్, 3.96 కోట్ల ఈ-స్కూటర్ ట్రిప్స్ నమోదయ్యాయని RTA వెల్లడించింది. ప్రత్యామ్నాయ రవాణా విధానాలకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టును మరింత విస్తృతంగా అమలు చేయనున్నట్లు ట్రాన్స్పోర్ట్ అథారిటీ తెలిపింది. ఈ ప్రాజెక్టు దుబాయ్ 2040 అర్బన్ మాస్టర్ ప్లాన్ లక్ష్యాలకు అనుగుణంగా రూపొందించబడిందని RTA తెలిపింది. నివాస ప్రాంతాలు, వ్యాపార కేంద్రాలు, ప్రజా రవాణా స్టేషన్లు, ముఖ్య గమ్యస్థానాల మధ్య మెరుగైన అనుసంధానం కల్పించడం, పర్యావరణహిత రవాణాను ప్రోత్సహించడం దీని ప్రధాన ఉద్దేశమని పేర్కొంది.
ఇప్పటికే అల్ మన్ఖూల్, అల్ ఖుసైస్, అల్ కరామా, అల్ బర్షా-1, అల్ బర్షా-2, అల్ ఖవానీజ్-2, హోర్ అల్ అంజ్, అబూ హైల్, అల్ సూక్ అల్ కబీర్ ప్రాంతాల్లో ఇలాంటి పనులను పూర్తి చేసింది. అలాగే మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్, బుర్జ్ ఖలీఫా/దుబాయ్ మాల్, ఆన్‌పాసివ్, గోల్డ్ సూక్, బుర్జుమాన్, బనియాస్ స్క్వేర్, షరఫ్ డీజీ, అబూ హైల్ సహా 37 మెట్రో స్టేషన్ల పరిసరాల్లో పాదచారుల మార్గాలు, సైక్లింగ్ ట్రాక్‌లు, మొబిలిటీ హబ్‌లు, షేర్డ్ మొబిలిటీ సదుపాయాలను ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చింది.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్‌లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







