కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- July 20, 2026
కువైట్ సిటీ: ఇటీవల కువైట్ ఎయిర్వేస్ విమానాలు రద్దయ్యాయన్న వార్తలను ఆ సంస్థ ఖండించింది. ఏ విమానాన్నీ రద్దు చేయలేదని, తాత్కాలిక అంతరాయాల కారణంగా కొన్ని సర్వీసుల సమయాలను మాత్రమే మార్చామని కువైట్ ఎయిర్వేస్ యాక్టింగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అబ్దుల్వహాబ్ ఇబ్రహీం అల్-షట్టి తెలిపారు. కువైట్ ఎయిర్వేస్ అన్ని డైరెక్ట్ విమానాలను ఆమోదించిన షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తోందన్నారు. శనివారం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టేకాఫ్, ల్యాండింగ్ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేయడంతో, ప్రయాణికుల భద్రత దృష్ట్యా కొన్ని విమానాల సమయాలను మాత్రమే మార్చాల్సి వచ్చిందని వివరించారు.
కువైట్ ఎయిర్వేస్ ఆపరేషన్స్, సాంకేతిక, పరిపాలనా బృందాలు ప్రభావిత విమానాలను వీలైనంత త్వరగా తిరిగి షెడ్యూల్ చేసి నిర్వహించాయని తెలిపారు. ఈ మార్పులు ఆదివారం విమాన సర్వీసులపై ఎలాంటి ప్రభావం చూపలేదని, అన్ని విమానాలు యథావిధిగా నడిచాయని చెప్పారు. ప్రాంతీయ పరిస్థితులను సంబంధిత అధికారులతో కలిసి నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ప్రయాణికుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ సేవలకు అంతరాయం కలగకుండా అనువైన కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తున్నామని అల్-షట్టి పేర్కొన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో కూడా సంస్థకు అవసరమైన సాంకేతిక, మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని, విమానాలను రద్దు చేయకుండా కేవలం రీషెడ్యూల్ చేయడం ద్వారా ప్రయాణికులకు కలిగే అసౌకర్యాన్ని గణనీయంగా తగ్గించగలిగామని తెలిపారు.
ప్రయాణికులు తాజా సమాచారం కోసం కువైట్ ఎయిర్వేస్ అధికారిక సమాచార మార్గాలనే ఫాలో కావాలని, టికెట్ బుకింగ్ సమయంలో తమ మొబైల్ నంబర్, ఈమెయిల్ వంటి వివరాలను సరిగా నమోదు చేయాలని సూచించారు. దీంతో విమాన షెడ్యూల్లో మార్పులు జరిగితే వెంటనే సమాచారం అందుతుందని తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







