షువైఖ్ ఇండస్ట్రియల్ ఏరియాలో తనిఖీలు.. 74 సంస్థలపై చర్యలు..!!
- September 09, 2026
కువైట్ : షువైఖ్ ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్నిప్రమాదాలు, భద్రతా నిబంధనల ఉల్లంఘనలను గుర్తించేందుకు జనరల్ ఫైర్ ఫోర్స్ విస్తృత తనిఖీలను నిర్వహించింది. క్యాపిటల్ గవర్నరేట్ పరిధిలో చేపట్టిన ఈ తనిఖీల్లో భద్రత, అగ్ని ప్రమాదాల నివారణ నిబంధనలు పాటించని భవనాలు, సంస్థలను అధికారులు పరిశీలించారు.ఈ తనిఖీలను కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ఎన్విరాన్మెంట్ పబ్లిక్ అథారిటీ తదితర ప్రభుత్వ సంస్థలు సమన్వయంతో నిర్వహించాయి.
తనిఖీల్లో నిబంధనలు పాటించని 74 సంస్థలపై పరిపాలనా చర్యలు తీసుకున్నారు. కొన్ని సంస్థలను మూసివేయడంతో పాటు, మరికొన్నింటికి నోటీసులు, హెచ్చరికలు జారీ చేశారు. జనరల్ ఫైర్ ఫోర్స్ నిర్దేశించిన అగ్నిమాపక, భద్రతా నిబంధనలతో పాటు ఇతర సంబంధిత ప్రభుత్వ సంస్థల నిబంధనలను ఉల్లంఘించిన వారిపైనా చర్యలు తీసుకున్నారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించడం, అగ్నిప్రమాదాలకు దారితీసే ప్రమాదకర పరిస్థితులను నివారించడం, అన్ని సంస్థలు భద్రతా నిబంధనలు పాటించేలా చూడటంలో భాగంగానే ఈ తనిఖీలను కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 7 దాడుల కథనంపై స్పందించిన ఎమిరేట్స్..!!
- సౌదీలో 5 రోజులపాటు వర్షాలు.. ప్రజలకు హెచ్చరిక..!!
- యూకేలో టెక్నికల్ ప్రాబ్లమ్.. ఖతార్ ఎయిర్వేస్ విమానాలకు అంతరాయం..!!
- లుసైల్ మరీనా ఇంటర్సెక్షన్ వద్ద యూ-టర్న్ మూసివేత..!!
- యూరోపియన్ దేశాల ప్రకటనను స్వాగతించిన ఒమన్..!!
- సౌదీపై హౌతీ దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- షువైఖ్ ఇండస్ట్రియల్ ఏరియాలో తనిఖీలు.. 74 సంస్థలపై చర్యలు..!!
- ఇరాన్ ట్యాంకర్లను ధ్వంసం చేసిన అమెరికా.. ప్రతీకారంగా ఇరాన్ మిసైల్ దాడులు
- బీసీసీఐ అసోసియేట్ స్పాన్సర్‌గా ChatGPT..!
- భారత్–కువైట్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చలు







