సినిమా రివ్యూ: ‘జన నాయకుడు’

- July 23, 2026 , by Maagulf
సినిమా రివ్యూ:  ‘జన నాయకుడు’

తమిళనాగు ముఖ్యమంత్రి కాకముందే విజయ్ నటించిన చిత్రమిది. రాజకీయాల్లో యాక్టివ్‌గా వుండడంతో ఈ సినిమా నేపథ్యం రాజకీయాలను బేస్ చేసుకుని రూపొందించారు. అయితే, అనుకున్న టైమ్‌కి ఈ సినిమా విడుదల కాలేకపోయింది. ఇప్పుడు విజయ్ తమిళనాడుకు సీఎం అవ్వడంతో ఈ సినిమా విడుదలపై తమిళనాడులో భారీ అంచనాలు నెలకొన్నాయ్. మరి, ఆ అంచనాల్ని ‘జననాయకుడు’ దక్కించుకున్నాడా.? లేదా.? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ:
దళపతి వెట్రి కొండన్ ఒకప్పుడు నిజాయితీ గల పోలీసాఫీసర్. అయితే, అనుకోని కారణాలతో ఆయన ప్రస్తుతం జైలులో వుండాల్సి వస్తుంది. జైలర్ (గౌతమ్ వాసుదేవ్ మీనన్), దళపతి నిజాయితీని చూసి అతనికి ఆకర్షితుడవుతాడు. ఆగస్టు 15న క్షమాభిక్ష కింద జైలు నుంచి విడుదలవుతాడు దళపతి. జైలులో వున్నప్పుడే జైలర్ కూతురువిజ్జి(మమిత బైజు) తో దళపతికి అనుబంధం ఏర్పడుతుంది. అనూహ్య పరిస్థితుల్లో జైలర్ మరణించడంతో ఆ పాపకి అన్నీ తానే అయ్యి కంటికి రెప్పలా పెంచి పెద్ద చేస్తాడు దళపతి. ఆర్మీలోకి వెళ్లాలనుకున్న విజ్జి, తనకున్న ఫియర్ ఫోబియాతో తాను ప్రేమించిన కుర్రోడ్ని పెళ్లి చేసుకుని సాధారణ జీవితం గడపాలనుకుంటుంది. కానీ, ఎలాగైనా విజ్జిలో ధైర్యం నూరి పోసి ఆమెని ఆర్మీకి పంపించాలన్నదే దళపతి కోరిక. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య విజ్జి ఓ గ్యాంగ్ స్టర్ గొడవలో ఇరుక్కుంటుంది విజ్జి. ఆ గ్యాంగ్, విజ్జిని చంపేందుకు తిరుగుతుంటారు. ఆ ప్రమాదం నుంచి విజ్జిని దళపతి ఎలా కాపాడాడు.? అసలు ఆ గ్యాంగ్‌తో విజ్జికి ఏంటీ సంబంధం.? హిమ్లర్ (బాబీ డియోల్) ఎవరు.? హిమ్లర్ గ్యాంగ్ నుంచి విజ్జిని కాపాడడంలో జర్నలిస్ట్ కాయల్ (పూజా హెగ్దే) పాత్ర ఏంటీ.? తెలియాలంటే ‘జననాయకుడు’ ధియేటర్లలో చూడాల్సిందే.

నటీనటుల పనితీరు:
దళపతి పాత్రలో విజయ్ చక్కగా ఒదిగిపోయాడు. కానీ, ఈ సినిమా తెలుగులో బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ సినిమాకి రీమేక్‌గా అనిపిస్తుంది. సో, తెలుగు ఆడియన్స్‌కి ఈ సినిమా కానీ, సినిమాలో దళపతి పాత్ర కానీ, ఏమంత కొత్తగా అనిపించవు సరికదా.. మళ్లీ ఆ సినిమానే రిపీట్ చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. కానీ, తమిళ ప్రేక్షకులకు మాత్రం ‘జననాయగన్’ మంచి ఐఫీస్ట్ అవుతుంది. దళపతి పాత్ర తర్వాత ఈ సినిమాలో మమితా బైజు గురించి చెప్పుకోవాలి. తెలుగులో శ్రీలీల పోషించిన పాత్రలోనే మమిత కనిపించింది. నిజానికి మమిత నుంచి ఇంకా చాలా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కానీ, ఆ స్థాయిలో వాడినట్లు అనిపించదు.ఇక, పూజా హెగ్ధే పాత్రకు పెద్దకు స్కోప్ లేదు. అక్కడక్కడా కనిపిస్తుందంతే. విలన్ రోల్ పోషించిన బాబీ డియోల్ తనకు అలవాటున్న పాత్రలోనే నటించి మెప్పించారు. కానీ, ఇంకా శక్తివంతంగా ఈ పాత్రను డిజైన్ చేసేందుకు స్కోప్ వుంది. మిగిలిన పాత్రధారులు రేవతి, ప్రకాష్ రాజ్, గౌతమ్ మీనన్  తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం పనితీరు:
విమెన్ ఎంపవర్‌మెంట్ నేపథ్యంలో దర్శకుడు హెచ్. వినోద్ ఈ సినిమా కథను నడిపించాడు. దానికి పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌ యాడ్ చేశాడు ప్రస్తుతం విజయ్ పొలిటికల్ నేపథ్యానికి సింక్ అయ్యేలా. అందుకు తగ్గట్లుగానే పొలిటికల్ ఫ్లేవర్‌లో డైలాగులు, హీరో ఎలివేషన్లూ..  యాక్షన్ ఎపిసోడ్స్ డిజైన్ చేశాడు. దాంతో, ఎలాంటి లాజిక్కుల్లేకుండా విజయ్ అభిమానులు ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు. కానీ, తెలుగులో ఈ సినిమా ఆశించిన కిక్ ఇవ్వదనడం నమ్మాల్సిన నిజం. ఇక, మిగిలిన టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే, అనిరుధ్ రవిచంద్రన్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. హీరో ఎలివేషన్ సన్నివేశాల్లోనూ, పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చే సీన్లలోనూ బీజీఎమ్ అదరగొట్టేశాడు అనిరుధ్. ఎడిటింగ్ విషయంలో కొంత ట్రిమ్మింగ్ చేయాల్సి వుంది. కానీ, ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్టుగా వున్నాయ్. 

ప్లస్ పాయింట్స్:
విజయ్ పర్‌ఫామెన్స్, సామాజిక పరిస్థితుల నేపథ్యంలో రూపొందించిన కొన్ని సన్నివేశాలు, హీరో ఎలివేషన్ సీన్లు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్..

మైనస్ పాయింట్స్:
ఎంటర్‌టైన్‌మెంట్ లోపించడం, ఆల్రెడీ ఈ సినిమాని తెలుగులో చూసేయడం.. బాలకృష్ణ హీరోగా‘ భగవంత్ కేసరి’ ఆల్రెడీ  సూపర్ హిట్  అయిన సంగతి తెలిసిందే.. మక్కికి మక్కీ అందులోని సన్నివేశాలే ఇందులోనూ వుండడం ఇరు భాషల్నీసమానంగా  అలరించలేదు. 

చివరిగా:
‘జననాయకుడు’  కేవలం తమిళ ప్రేక్షకులకు మాత్రమే.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com