నేడే తొలి ఏకాదశి..
- July 25, 2026
తెలుగువారి ముఖ్యమైన పండగలలో అత్యంత పవిత్రమైనది, ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగినది ‘తొలి ఏకాదశి’ (శయని ఏకాదశి). ఈ శుభదినాన శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో యోగనిద్రలోకి ప్రవేశిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు వేకువజామునే తలస్నానం ఆచరించి, ఇల్లు మరియు పూజా మందిరాన్ని శుద్ధి చేసుకోవాలి. శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైన తులసీ దళాలతో సమంత్రకంగా అర్చన చేసి, భక్తిశ్రద్ధలతో ధూపదీప నైవేద్యాలను సమర్పించాలి. జగద్రక్షకుడైన విష్ణుమూర్తి దివ్య నామాలను స్మరిస్తూ పూజించడం వల్ల సకల సంపదలు, మనశ్శాంతి లభిస్తాయని పండితులు పేర్కొంటున్నారు.
ఉపవాసం, జాగరణలతో పాప విమోచనం
తొలి ఏకాదశి నాడు ఆచరించే నియమాలకు అత్యంత ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. ఈ రోజున అన్నం, బియ్యంతో తయారు చేసిన వంటకాలు, ధాన్య పదార్థాలు, ఉల్లి, వెల్లుల్లితో పాటు మాంసాహారం మరియు మద్యానికి పూర్తిగా దూరంగా ఉండాలి. పూర్తి ఉపవాస నియమాన్ని పాటిస్తూ, రాత్రి సమయంలో విష్ణు సహస్రనామ పారాయణం, భజనలు మరియు కీర్తనలతో ‘జాగరణ’ చేయాలి. ఈ విధంగా మనస్సును, కాయాన్ని భగవంతునిపై లగ్నం చేసి వ్రతాన్ని ఆచరించడం వల్ల పూర్వజన్మ పాపాలు తొలగిపోయి, భవబంధాల నుండి ముక్తి లభించడమే కాకుండా శ్రీమహావిష్ణువు పరిపూర్ణ అనుగ్రహం సిద్ధడుతుందని విశ్వసిస్తారు.
తాజా వార్తలు
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- యూఏఈ లాటరీలో Dh100,000 బహుమతి గెలిచిన వ్యక్తి..!!
- బహ్రెయిన్‌లో BD14,000 విలువైన చోరీలు.. ఐదుగురు అరెస్ట్..!!
- సౌదీలో భారీగా అక్రమ నివాసితుల అరెస్టులు..!!
- ఖతార్‌లో మరింత సులభంగా డొమెస్టిక్ వర్కర్ నియామకం..!!
- ఒమన్–అమెరికా జాయింట్ మిలిటరీ కమిటీ సమావేశం..!!
- ఫైలాకా దీవి సమీపంలో కువైట్ నేవీ లైవ్-ఫైర్ డ్రిల్..!!
- రాష్ట్రపతి ముర్ముతో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ భేటీ
- చిన్నారి కోరిక తీర్చిన దుబాయ్ పోలీస్.. హట్టా స్మార్ట్ పోలీస్ స్టేషన్లో ప్రత్యేక అనుభవం
- BRICS సమ్మిట్ తొలిరోజు అద్భుత దృశ్యం







