ఖతార్‌లో మరో మూడు సంవత్సరాల పాటు ONE ఛాంపియన్‌షిప్ పోటీలు..!!

- July 25, 2026 , by Maagulf
ఖతార్‌లో మరో మూడు సంవత్సరాల పాటు ONE ఛాంపియన్‌షిప్ పోటీలు..!!

దోహా: ప్రపంచంలోనే అతిపెద్ద మార్షల్ ఆర్ట్స్ సంస్థ ONE ఛాంపియన్‌షిప్ మరియు విజిట్ ఖతార్ తమ భాగస్వామ్యాన్ని మరో మూడు సంవత్సరాలకు పొడిగించాయి. ఈ ఒప్పందం ప్రకారం 2027 నుంచి ఖతార్‌లో వరుసగా అంతర్జాతీయ స్థాయి ONE ఛాంపియన్‌షిప్ ఈవెంట్లు నిర్వహించనున్నారు. ఈ మూడు సంవత్సరాల కాలంలో నిర్వహించే పోటీల్లో MMA, మువాయ్ థాయ్, కిక్‌బాక్సింగ్, సబ్‌మిషన్ గ్రాప్లింగ్ విభాగాల్లో ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీలు జరగనున్నాయి. అంతర్జాతీయ స్టార్ క్రీడాకారులతో పాటు మధ్యప్రాచ్యానికి చెందిన ప్రతిభావంతులైన ఫైటర్లకు కూడా అవకాశం కల్పించనున్నారు.

ఈ ఈవెంట్ల ద్వారా విదేశీ పర్యాటకుల రాక పెరగడంతో పాటు ఖతార్‌కు ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు లభిస్తుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం కింద తొలి ఈవెంట్ 2027 మార్చి 26న దోహాలోని అస్పైర్ డోమ్ లో జరగనుంది. టికెట్ల విక్రయం, ఇతర వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా ONE ఛాంపియన్‌షిప్ సహ వ్యవస్థాపకుడు, గ్రూప్ అధ్యక్షుడు హువా ఫంగ్ టెహ్ మాట్లాడుతూ..  ఖతార్‌తో భాగస్వామ్యాన్ని కొనసాగించడం ఆనందంగా ఉందన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com