శ్రీవారి భక్తులకు అలర్ట్..ఆగస్టు 1 నుండి పుష్కరిణి మూసివేత!
- July 25, 2026
తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయానికి ఉత్తరం వైపున ఉన్న పవిత్ర స్వామి పుష్కరిణి మరమ్మతులు, శుద్ధి పనుల కోసం ఆగస్టు 1వ తేదీ నుండి మూసివేయబడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రకటించింది. ప్రతీ ఏటా ఏడుకొండల స్వామి బ్రహ్మోత్సవాలకు ముందు పుష్కరిణిలోని నీటిని పూర్తిగా తొలగించి శుభ్రం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 15వ తేదీ నుండి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 11వ తేదీ నుండి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు ముందే పుష్కరిణిని సిద్ధం చేయాలని టీటీడీ అదనపు ఈఓ చిరుమామిళ్ళ వెంకయ్యచౌదరి ఇంజనీరింగ్, వాటర్ వర్క్స్ విభాగ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
40 రోజుల పాటు మూసివేత.. భక్తులకు ప్రవేశం లేదు
సివిల్ పనులు, లోపల ఉన్న పైప్లైన్ల మరమ్మతుల కోసం ఆగస్టు 1 నుండి 31వ తేదీ వరకు పుష్కరిణిని పూర్తిగా మూసివేస్తారు. అనంతరం వర్షాకాలం, తుఫాన్లు, ఇతర ముందస్తు జాగ్రత్త చర్యల దృష్ట్యా సెప్టెంబర్ 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు కూడా మూసివేత కొనసాగుతుంది. అంటే మొత్తం 40 రోజుల పాటు భక్తులను పుష్కరిణిలోకి దిగడానికి గానీ, స్నానాలు చేయడానికి గానీ అనుమతించరు. అంతేకాకుండా, ఈ కాలంలో నిర్వహించే రోజువారీ పుష్కరిణి హారతి కార్యక్రమాన్ని కూడా తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు.
తాజా వార్తలు
- భారత చిన్నారుల విద్య కోసం జీవితాన్ని అంకితం చేసిన శాండ్రా
- శ్రీవారి భక్తులకు అలర్ట్..ఆగస్టు 1 నుండి పుష్కరిణి మూసివేత!
- విద్యాసంస్థల్లో డ్రగ్స్ నిర్మూలనకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- గోవాలో జూలై 25–27 వరకు ‘యూత్ ఐకానిక్ ఎంటర్‌ప్రెన్యూర్స్ సమ్మిట్–2026’
- ఎన్ఆర్ఐ సర్టిఫికెట్ల కోసం అత్యవసర సేవలు.. దుబాయ్‌లోని భారత కాన్సులేట్ కీలక ప్రకటన..!!
- ఖతార్‌లో మరో మూడు సంవత్సరాల పాటు ONE ఛాంపియన్షిప్ పోటీలు..!!
- షైఖ్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రాకపోకలపై ఆంక్షలు..!!
- సముద్ర భద్రత, నౌకాయాన స్వేచ్ఛకు ఒమాన్ మద్దతు..!!
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..







