యన్‌బు, జాజాన్‌లో పరిస్థితి సాధారణం.. సౌదీ సివిల్ డిఫెన్స్ వెల్లడి..!!

- July 25, 2026 , by Maagulf
యన్‌బు, జాజాన్‌లో పరిస్థితి సాధారణం.. సౌదీ సివిల్ డిఫెన్స్ వెల్లడి..!!

రియాద్: సౌదీ అరేబియాలోని యన్‌బు గవర్నరేట్ మరియు జాజాన్ ప్రాంతాల్లో అత్యవసర హెచ్చరికల అనంతరం పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి చేరుకుందని సౌదీ సివిల్ డిఫెన్స్ ప్రకటించింది.

నేషనల్ ఎర్లీ వార్నింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రమాదాన్ని హెచ్చరిస్తూ యన్‌బు, జాజాన్ ప్రాంతాలకు అత్యవసర అలర్ట్‌లు జారీ చేసినట్లు సివిల్ డిఫెన్స్ తన అధికారిక ఎక్స్ (X) వేదికలో వెల్లడించింది.

అనంతరం పరిస్థితిని సమీక్షించిన అధికారులు, ప్రమాదం పూర్తిగా తొలగిపోయిందని, రెండు ప్రాంతాల్లోనూ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని స్పష్టం చేశారు. ప్రజలు అధికారిక ప్రకటనలను మాత్రమే ఫాలోకావాలని, వారి సూచనలను పాటించాలని అధికారులు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com