ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్‌లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్‌తో ప్రయాణం

- July 27, 2026 , by Maagulf
ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్‌లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్‌తో ప్రయాణం

దుబాయ్: ఎమిరేట్స్ స్కైవార్డ్స్ తన సభ్యులకు యూరప్‌లో మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అవకాశాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్తగా ప్రారంభించిన ‘స్కైవార్డ్స్ రైల్’ సేవ ద్వారా సభ్యులు తమ స్కైవార్డ్స్ మైల్స్‌ను ఉపయోగించి యూరప్‌లోని 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పించింది.

ఈ సేవ ద్వారా 12 యూరోపియన్ దేశాల్లోని 40కుపైగా ప్రముఖ రైల్వే ఆపరేటర్ల నెట్‌వర్క్‌కు సభ్యులు అనుసంధానమవుతారు. వివిధ రైలు సమయాలు, క్యాబిన్‌లు, టికెట్ రకాలను ఎంపిక చేసుకుని, పూర్తిగా మైల్స్‌తో లేదా క్యాష్ + మైల్స్ కలయికలో చెల్లించి టికెట్లు కొనుగోలు చేయవచ్చు.

ఎమిరేట్స్ స్కైవార్డ్స్ డివిజనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ నజీబ్ బెన్ ఖెదర్ మాట్లాడుతూ, సభ్యులు తమ స్కైవార్డ్స్ మైల్స్‌ను విమాన ప్రయాణాలకే కాకుండా మరింత విస్తృతంగా వినియోగించుకునే అవకాశాలను కోరుతున్నారని తెలిపారు. ఆ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని స్కైవార్డ్స్ రైల్ సేవను ప్రవేశపెట్టినట్లు చెప్పారు.

ఈ కొత్త సేవతో యూరప్‌లో విమాన ప్రయాణంతో పాటు రైలు ప్రయాణాన్ని కూడా ఒకే లాయల్టీ ప్రోగ్రామ్ ద్వారా సులభంగా ప్లాన్ చేసుకునే వీలుకలగనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com