ఎల్‌నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- July 27, 2026
జెడ్డా: సౌదీ అరేబియాలో 2026 చివరి నుంచి 2027 ప్రారంభం వరకు ఎల్‌నినో (El Niño) ప్రభావం కొనసాగే అవకాశాలు ఉన్నాయని నేషనల్ సెంటర్ ఫర్ మెటియరాలజీ (NCM), క్లైమేట్ చేంజ్ సెంటర్ (CCC) హెచ్చరించాయి. దీని ప్రభావంతో దేశంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవడంతో పాటు వర్షపాతం విధానంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని వెల్లడించాయి.
ప్రస్తుతం సౌదీ ఎల్‌నినో–సదర్న్ ఆసిలేషన్ (ENSO) తటస్థ దశలో ఉందని, జూలై 5 నాటికి నినో 3.4 ఇండెక్స్ +0.39 డిగ్రీల సెల్సియస్ వద్ద నమోదైందని తెలిపాయి. వాతావరణ అంచనాల ప్రకారం రానున్న నెలల్లో ఎల్‌నినో పరిస్థితులు బలపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, నినో 3.4 ఇండెక్స్ +0.8 డిగ్రీల సెల్సియస్‌ను దాటి సుమారు +1.25 డిగ్రీల సెల్సియస్ వరకు చేరే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఇది మరింత తీవ్రమైన ఎల్నినోగా మారే అవకాశాన్ని కూడా తోసిపుచ్చలేమని తెలిపాయి.
అలాగే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో అసాధారణ పెరుగుదల కొనసాగుతుందని, మేలో +1.1 డిగ్రీల సెల్సియస్‌గా ఉన్న నినో 3.4 ఉష్ణోగ్రత వ్యత్యాసం అక్టోబర్ నాటికి +2.8 డిగ్రీల సెల్సియస్‌కు చేరవచ్చని అంచనా వేశాయి.
ఈ ప్రభావంతో పశ్చిమ సౌదీలో ఆటమ్ సీజన్ లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పాటు ఆకస్మిక వరదల ముప్పు పెరుగుతుందని హెచ్చరించాయి. అలాగే 2026–27 వింటర్ సీజన్ లో సౌదీలోని కొన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపాయి. నైరుతి పర్వత ప్రాంతాల్లో వచ్చే వసంతకాలంలో సగటు కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశముందని పేర్కొన్నాయి.
దేశవ్యాప్తంగా పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని, వేసవి, ఆటమ్ లో హీట్‌వేవ్స్ మరింత తరచుగా సంభవించే అవకాశముందని, వింటర్ లో కూడా సాధారణం కంటే వెచ్చగా ఉండటంతో తీవ్ర చలి పరిస్థితులు ఏర్పడే అవకాశం తగ్గుతుందని ఎన్సీఎం, సీసీసీ వెల్లడించాయి.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్‌నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్‌లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్‌కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్‌లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్‌తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్‌షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







