మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- July 31, 2026
దోహా: ఖతార్‌లోని మెసైమీర్ ఇంటర్చేంజ్ (ఎగ్జిట్–33) వద్ద ఉన్న టన్నెల్‌ను నిర్వహణ పనుల నేపథ్యంలో ఈ వారాంతంలో తాత్కాలికంగా మూసివేయనున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఓఐ) ప్రకటించింది.
మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, జూలై 31 (శుక్రవారం) తెల్లవారుజామున 2 గంటల నుంచి 10 గంటల వరకు, అలాగే ఆగస్టు 1 (శనివారం) తెల్లవారుజామున 2 గంటల నుంచి 7 గంటల వరకు టన్నెల్లో వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నారు.
ఈ నేపథ్యంలో వాహనదారులు తమ ప్రయాణాలను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని, వీలైనంత వరకు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని అధికారులు సూచించారు. ట్రాఫిక్ సూచికలు, పోలీసుల ఆదేశాలను పాటించడం ద్వారా ట్రాఫిక్ రద్దీని నివారించి సురక్షిత ప్రయాణానికి సహకరించాలని ఎంఓఐ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత
- కువైట్‌లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్‌లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్‌లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







