వరుస పేలుళ్లు అసోంలో..
- August 15, 2016
ఓవైపు రాష్ట్రమంతా స్వాతంత్య్ర వేడుకలు జరుపుకొంటుంటే.. మరోవైపు అసోంలో వరుస పేలుళ్లు సంభవించాయి. ఉల్ఫా-ఇండిపెండెంట్ మిలిటెంట్లు రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో ఐఈడీ పేలుళ్లకు పాల్పడ్డారు. అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనల్లో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని అధికారులు తెలిపారు.
తొలుత ఉదయం 7.15 గంటల ప్రాంతంలో లయ్పులిలోని ఇందిరాగాంధీ స్కూల్ సమీపంలో బాంబు పేలుడు సంభవించింది. ఇది జరిగిన కొద్ది నిమిషాలకే.. దూందుమా ప్రాంతంలోని ఓ టీ ఎస్టేట్, మసువా ప్రాంతంలో వెంటవెంటనే బాంబులు పేలినట్లు పోలీసులు తెలిపారు. తర్వాత కొద్ది సేపటికే ఫిలోబరి ప్రాంతంలో మరోసారి పేలుడు సంభవించింది. వరుస పేలుళ్లతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే ఎక్కడా ఎవరూ గాయపడనట్లు సమాచారం లేదు.
తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







