మెట్రాష్ యాప్‌తో సీఐడీకి గోప్యంగా సమాచారం అందించే అవకాశం..!!

- August 03, 2026 , by Maagulf
మెట్రాష్ యాప్‌తో సీఐడీకి గోప్యంగా సమాచారం అందించే అవకాశం..!!

దోహా: ఖతార్‌లో ప్రజా భద్రతను మరింత పటిష్ఠం చేసే దిశగా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రాష్ (Metrash) యాప్ ద్వారా క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CID)కు భద్రతా సంబంధిత సమాచారాన్ని గోప్యంగా అందించే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేవ ద్వారా ప్రజలు ఎలాంటి సేవా కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా మెట్రాష్ యాప్‌లోనే అనుమానాస్పద అంశాలపై సమాచారాన్ని అందించవచ్చని తన సోషల్ మీడియాలో ఒక  వీడియోను షేర్ చేసింది. యాప్‌లో Security విభాగంలోకి వెళ్లి Security Complaint ఎంపికను ఎంచుకోవాలి. అనంతరం Criminal Investigation Departmentను ఎంపిక చేసి Provide Information ద్వారా వివరాలను నమోదు చేసి పంపించాలి.

అనుమానాస్పద వాహనాలు, వ్యక్తులు, సంస్థలు, నివాసాలు, అలాగే నేర కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని ఈ సేవ ద్వారా అందించవచ్చు. సమాచారం నమోదు చేసే సమయంలో పూర్తి వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని హోం శాఖ సూచించింది. ప్రజల భాగస్వామ్యంతో భద్రతా వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడం, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించడమే ఈ సేవ లక్ష్యమని కతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com