బహ్రెయిన్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో 'ఈడబ్ల్యూబీ కలినేర్' సేవలు..!!
- August 03, 2026
మనామా: బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ (BIEC) తన కొత్త హాస్పిటాలిటీ బ్రాండ్ 'ఈడబ్ల్యూబీ కలినేర్ (EWB Culinaire)' పేరుతో క్యాటరింగ్ సేవలను ప్రారంభించింది. ఎగ్జిబిషన్లు, సదస్సులు, కార్పొరేట్ కార్యక్రమాలు, వివాహాలు, వ్యక్తిగత వేడుకలతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు దీర్ఘకాలిక ఆహార సేవలు అందించేందుకు బుకింగ్‌లు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.ప్రొఫెషనల్ చెఫ్‌ల బృందం రూపొందించిన ప్రత్యేక మెనూలలో అంతర్జాతీయ, ప్రాంతీయ వంటకాలతో పాటు లైవ్ కుకింగ్ స్టేషన్లు, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక డైనింగ్ సదుపాయాలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.
సుమారు 3,600 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన బహ్రెయిన్‌లోనే అతిపెద్ద సమగ్ర ఈవెంట్స్ కిచెన్ ద్వారా రోజుకు 10 వేల మంది అతిథులకు భోజనం అందించే సామర్థ్యం ఈ కేంద్రానికి ఉంది. చిన్నస్థాయి సమావేశాల నుంచి అంతర్జాతీయ ఎగ్జిబిషన్లు, భారీ వేడుకల వరకు అన్ని రకాల కార్యక్రమాలకు క్యాటరింగ్ సేవలు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరిగే కార్యక్రమాలతో పాటు బహ్రెయిన్ వ్యాప్తంగా ప్రైవేట్ వేడుకలు, కార్పొరేట్ ఈవెంట్లు, దీర్ఘకాలిక క్యాటరింగ్ ఒప్పందాలకు కూడా ఈ సేవలను విస్తరించనున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా బహ్రెయిన్ వరల్డ్ ఎగ్జిబిషన్ సెంటర్ ఈవెంట్స్ మేనేజర్ అలీ తురానీ మాట్లాడుతూ.. అతిథులకు అత్యుత్తమ ఆతిథ్య అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో 'ఈడబ్ల్యూబీ కలినేర్'ను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రపంచస్థాయి ఎగ్జిబిషన్లు, సదస్సులు, విలాసవంతమైన వివాహాలు, ప్రైవేట్ వేడుకలకు అనుగుణంగా విభిన్న మెనూలను రూపొందించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సలాలాలో ఒమన్-బహ్రెయిన్ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో 'ఈడబ్ల్యూబీ కలినేర్' సేవలు..!!
- కావేరి జలాల వివాదం.. సీఎం విజయ్ ముందున్న తొలి రాజకీయ సవాల్
- 2026 తొలి ఆరు నెలల్లో ఒమన్‌లో తగ్గిన జననాలు, మరణాలు..!!
- అట్టహాసంగా ముగిసిన కామన్వెల్త్ గేమ్స్!
- 75 రోజుల పాటు బురైదా అంతర్జాతీయ డేట్స్ ఫెస్టివల్..!!
- గాలిలో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు..ఇద్దరు పైలట్లు మృతి
- మెట్రాష్ యాప్‌తో సీఐడీకి గోప్యంగా సమాచారం అందించే అవకాశం..!!
- భారత్ లో ఒక్కో యూజర్ నెలకు 50 గంటలు ఇన్స్టాలోనే!
- సెప్టెంబర్‌లో రోజుకు 1.88 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి పెంపు..!!







