‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్
- August 05, 2026
ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు ప్రజ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ‘ఆధార్’ అప్డేట్ పేరుతో కొత్త రకం మోసాలకు పాల్పడుతున్నారు. తక్షణమే మీ ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోకపోతే బ్యాంక్ ఖాతాలు బ్లాక్ లేదా నిలిపివేయబడతాయని బ్యాంకుల పేరిట నకిలీ మెసేజ్‌లను (SMS/WhatsApp) పంపుతూ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నారు. ఈ సైబర్ మోసాల పట్ల తెలంగాణ రాష్ట్ర పోలీసులు ప్రజలను తీవ్రంగా హెచ్చరించారు. ఈ తరహా నకిలీ సందేశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదని, అపరిచిత వ్యక్తుల నుండి లేదా అనుమానాస్పద నంబర్ల నుండి వచ్చే మెసేజ్‌లపై ఏమాత్రం అప్రమత్తత సడలించవద్దని సూచించారు.
లింక్స్, నకిలీ ఏపీకే ఫైళ్ల పట్ల పోలీసుల హెచ్చరికలు
ఇలాంటి నకిలీ సందేశాల్లో ఇచ్చే అనుమానాస్పద లింక్‌లను (Links) క్లిక్ చేయడం వల్ల తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పోలీసులు స్పష్టం చేశారు. ఆ లింక్స్ ద్వారా ఫోన్లలో ఏపీకే (APK) ఫైల్స్ డౌన్లోడ్ అయ్యేలా చేసి, బాధితుల మొబైల్ ఫోన్లను సైబర్ నేరగాళ్లు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారని తెలిపారు. బ్యాంకింగ్ లావాదేవీలు లేదా ఆధార్ సంబంధిత వివరాల సరిచూపు కోసం ఎల్లప్పుడూ బ్యాంకుల అధికారిక యాప్‌లను (Official Banking Apps) లేదా సంబంధిత అధికారిక వెబ్సైట్లను మాత్రమే ఉపయోగించాలని పోలీసులు ట్విట్టర్ (X) వేదికగా సూచించారు. ఎవరైనా ఈ సైబర్ మోసాల బారిన పడితే తక్షణమే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించాలని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!
- సౌదీలో కొత్త హౌజింగ్ నిర్మాణ విధానానికి కేబినెట్ ఆమోదం..!!
- కువైట్‌లో నకిలీ ప్రభుత్వ స్టాంపుల ముఠా గుట్టురట్టు..!!
- యూఏఈలో వర్కర్లను నియమించుకునే వారికి కీలక సూచనలు..!!
- అమీర్‌తో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు..!!
- ఒమాన్‌లో ఆగస్టులో ఎండల తీవ్రత అధికం..!!
- షిర్డీ సాయిబాబాకు బంగారు ‘రామ్’ అక్షరాన్ని కానుకగా సమర్పించిన దుబాయ్ భక్తులు
- 25 టన్నుల కల్తీ మసాలా దినుసులు సీజ్ : సిపి సజ్జనార్







