రేపు రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అంత్యక్రియలు
- July 28, 2015
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆజాద్ మృతిపట్ల కేంద్ర కేబినెట్ సంతాపం వ్యక్తం చేసింది. కలాం సేవలను కొనియాడుతూ కేంద్ర కేబినెట్ తీర్మానం చేసింది. రేపు రామేశ్వరంలో కలాం అంత్యక్రియలు జరగనున్నట్లు కేబినెట్ తెలిపింది. కలాం మృతికి 7 రోజులు సంతాప దినాలుగా కేంద్రం ప్రకటించింది. ఢిల్లీలోని రాజాజీమార్గ్‌లో ఈరోజు మధ్యాహ్నం నుంచి కలాం పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. ఆ తరువాత భౌతికకాయాన్ని ఆయన జన్మస్థలం రామేశ్వరానికి తరలిస్తామని కేంద్రమంత్రి రూడీ తెలిపారు. అంతకుముందు బీజేపీ పార్లమెంట్ సమావేశంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. సభ్యులంతా రెండు నిమిషాలు మౌనం పాటించారు. కలాం మరణంతో భారతదేశం తన రత్నాన్ని కోల్పోయిందని ఈ సందర్భంగా మోదీ అన్నారు. అబ్దుల్ కలాం ముందు దేశానికి భారతరత్నమని ఆ తరువాతే రాష్ట్రపతి అయ్యారని ప్రధాని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







