ఒలింపిక్స్‌ మైదానాల్లో కార్చిచ్చు కలకలం..

- August 15, 2016 , by Maagulf
ఒలింపిక్స్‌ మైదానాల్లో కార్చిచ్చు కలకలం..

ఒలింపిక్స్‌ మైదానాల్లో కార్చిచ్చు కలకలం రేపింది. ఒలింపిక్‌ హాకీ మైదానంలోకి కార్చిచ్చు బూడిద వ్యాపించడంతో అక్కడే ఉన్న అథ్లెట్లను, బీఎంఎక్స్‌ కేంద్రాన్ని ఖాళీ చేయించారు. సోమవారం మధ్యాహ్నం రియోలో ఉష్ణోగ్రత భారీగా పెరగటంతో కార్చిచ్చు ఏర్పడింది. దీంతో హాకీ మైదానం, ఎక్స్‌పార్క్‌, ది కెనోయి స్లాలోమ్‌, బీఎంఎక్స్‌, మౌంటేన్‌ బైకింగ్‌ ఈవెంట్లు జరిగే ప్రదేశాలను ఖాళీ చేయించారు.అగ్నికి ఆజ్యం పోసినట్లు దీనికి గాలికూడా తోడవడంతో మంటలు త్వరగా వ్యాపించాయి. గాలుల కారణంగా ఒలింపిక్‌ పార్క్‌లో కెమెరా కూలిపోయిందని భావిస్తున్నారు. ఈ ఘటనలో ఏడుగురు గాయపడ్డారు.ఫీల్డ్‌హాకీ స్టేడియంలో బూడిద పడుతున్న సమయంలో అమెరికా జర్మనీ జట్లమధ్య మ్యాచ్‌ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో అమెరికా విజయం సాధించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com