600 మంది కొత్త టీచర్లకు స్వాగతం

- August 16, 2016 , by Maagulf
600 మంది కొత్త టీచర్లకు స్వాగతం



అబుదాబీ ఎడ్యుకేషన్‌ కౌన్సిల్‌ (ఎడిఇసి) ఇటీవలే ఒకరోజు ఓరియెంటేషన్‌ సెషన్‌ని కొత్త టీచర్ల కోసం ఏర్పాటు చేసింది. అబుదాబీ, అల్‌ అయిన్‌ మరియు వెస్టర్న్‌ రీజియన్‌లో 2016-17 విద్యా సంవత్సరానికిగాను వీరంతా కొత్తగా పలు స్కూళ్ళలో నియమితులు కానున్నారు. ఎడిఇసి డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ అలి అల్‌ నౌమి ఈ సందర్భంగా 600 ఎమిరేటీ, ఇంగ్లీసు మీడియం, అరబిక్‌ మీడియం టీచర్లకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వెల్‌కమ్‌ స్పీచ్‌ ఇచ్చిన అల్‌ నౌమి, ఎడిఇసి సాధించిన విజయాల గురించి తెలియజేశారు. పలు ప్రాజెక్టులు, యాక్టివిటీస్‌ గురించి వివరించారు. ఎమిరేట్‌కి చెందిన ఎడ్యుకేషన్‌ సెక్టార్‌ గురించిన వివరించారు. అబుదాబీ స్కూల్‌ మోడల్‌ని హైలైట్‌ చేస్తూ, పిల్లల ఆలోచనల్ని కొత్తదనం వైపుకు పరుగులు పెట్టించేలా డిజైన్‌ చేసినట్లు తెలిపారు. కొత్త టీచర్లు, ఇప్పటికే ఉన్న టీచర్లు, అలాగే నాన్‌ టీచింగ్‌ స్టాప్‌కి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని అల్‌ నౌమి చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com