రాత్రివేళ లైట్లు లేకుండా డ్రైవింగ్ చేస్తే QR10,000 వరకు జరిమానా..!!

- August 11, 2026 , by Maagulf
రాత్రివేళ లైట్లు లేకుండా డ్రైవింగ్ చేస్తే QR10,000 వరకు జరిమానా..!!

దోహా: రాత్రివేళ వాహనాలకు లైట్లు వేయకుండా డ్రైవింగ్ చేసే వాహనదారులకు భారీ జరిమానా విధించే అవకాశం ఉందని ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) హెచ్చరించింది. రాత్రి సమయంలో వాహనాల హెడ్‌లైట్లు సక్రమంగా వినియోగించాలని వాహనదారులకు సూచించింది.

లైట్లు లేకుండా డ్రైవింగ్ చేయడం వల్ల రోడ్డు ప్రమాదాల ముప్పు పెరగడంతో పాటు ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని MoI పేర్కొంది. ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు.
ట్రాఫిక్ చట్టానికి సంబంధించిన 2007 నాటి చట్టం నంబర్ 19లోని ఆర్టికల్ 70 ప్రకారం, రాత్రి సమయంలో సరైన లైట్లు లేకుండా వాహనాలను నడపకూడదు. వాతావరణ పరిస్థితుల కారణంగా విజిబిలిలీ తక్కువగా ఉన్న పగటిపూట కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. మోటారు వాహనాల విషయంలో, హెడ్‌లైట్లు మరియు వెనుక లైట్లను (rear lights) తప్పనిసరిగా ఉపయోగించాలని చట్టం నిర్దేశిస్తోంది. వాహనదారులు ఈ ఉల్లంఘనకు పాల్పడితే ఒక వారం కంటే తక్కువ కాకుండా మరియు ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాకుండా జైలు శిక్ష, లేదా QR 3,000 నుండి QR 10,000 వరకు జరిమానా విధించవచ్చు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com