సౌదీలో 27,360 షెవర్లే కార్ల రీకాల్.. ఎయిర్‌బ్యాగ్ లో లోపం..!!

- August 11, 2026 , by Maagulf
సౌదీలో 27,360 షెవర్లే కార్ల రీకాల్.. ఎయిర్‌బ్యాగ్ లో లోపం..!!

రియాద్: ఎయిర్‌బ్యాగ్‌లో లోపం కారణంగా ప్రమాద సమయంలో తీవ్ర గాయాలు లేదా మరణం సంభవించే అవకాశం ఉందని గుర్తించిన సౌదీ వాణిజ్య మంత్రిత్వ శాఖ 27,360 షెవర్లే వాహనాలను రీకాల్ చేసింది. డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్ ఇన్‌ఫ్లేటర్‌లో లోపం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రమాద సమయంలో ఎయిర్‌బ్యాగ్ తెరుచుకునే సందర్భంలో పదునైన లోహపు ముక్కలు బయటకు దూసుకొచ్చే ప్రమాదం ఉందని, దీనివల్ల వాహనంలోని వారికి తీవ్ర గాయాలు లేదా ప్రాణహాని కలగవచ్చని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.

ఈ రీకాల్ పరిధిలో షెవర్లే ట్రాక్స్, క్రూజ్, అవియో మోడళ్లు ఉన్నాయి. ట్రాక్స్ 2010–2017 మోడల్ , క్రూజ్ 2012–2018 మోడల్, అవియో 2010–2017 మోడల్  కార్లు ఉన్నాయి. తమ వాహనం రీకాల్ పరిధిలో ఉందో లేదో తెలుసుకునేందుకు వాహన యజమానులు వెహికల్ ఐడేంటీఫికేషన్ నంబర్ (VIN) ను ఉపయోగించి Recalls.sa వెబ్‌సైట్‌లో తనిఖీ చేసుకోవాలని సౌదీ వాణిజ్య మంత్రిత్వ శాఖ సూచించింది. రీకాల్‌కు సంబంధించిన వాహనాల యజమానులు జనరల్ మోటర్స్, అల్జోమైహ్ ఆటోమోటివ్ కంపెనీ లేదా యూనివర్సల్ మోటార్స్ ఏజెన్సీలను సంప్రదించి అవసరమైన మరమ్మతులను ఉచితంగా చేయించుకోవాలని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com