డీప్‌ఫేక్‌లపై ఖతార్ హోంశాఖ హెచ్చరిక..!!

- August 12, 2026 , by Maagulf
డీప్‌ఫేక్‌లపై ఖతార్ హోంశాఖ హెచ్చరిక..!!

దోహా: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో వ్యక్తులను అనుకరిస్తూ రూపొందిస్తున్న డీప్‌ఫేక్ వీడియోలు, ఆడియోలు, ఇతర కృత్రిమ కంటెంట్‌పై ఖతర్ హోంశాఖ (MoI) ప్రజలను అప్రమత్తం చేసింది. సోషల్ మీడియా ద్వారా విడుదల చేసిన హెచ్చరికలో డిజిటల్ భద్రతకు సంబంధించిన పలు సూచనలు చేసింది. AI ఆధారిత మోసాలకు ప్రజలు బలికాకుండా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ.. “మీరు చూసినదంతా, విన్నదంతా నిజం కాదు” అని హోంశాఖ పేర్కొంది.

డీప్‌ఫేక్‌ల బారిన పడకుండా ప్రజలు ఆన్‌లైన్‌లో కనిపించే కంటెంట్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని హోంశాఖ సూచించింది. ఏదైనా వీడియో, ఆడియో లేదా సమాచారాన్ని ఇతరులకు పంపే ముందు దాని మూలం, విశ్వసనీయతను తప్పనిసరిగా నిర్ధారించుకోవాలని తెలిపింది. సమాచారం నిజమని నిర్ధారణ కానంత వరకు దాన్ని నమ్మడం లేదా షేర్ చేయడం చేయొద్దని హెచ్చరించింది. AI వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో డిజిటల్ కంటెంట్‌ను పరిశీలించి, దాని నిజానిజాలను నిర్ధారించుకున్న తర్వాతే స్పందించడం ద్వారా ప్రజలు మోసాల నుంచి రక్షించుకోవచ్చని హోంశాఖ పేర్కొంది.

మెషిన్ లెర్నింగ్ వంటి సాంకేతికతలను ఉపయోగించి ఒక వ్యక్తి నిజంగా చెప్పని మాటలను చెప్పినట్లు, చేయని పనులను చేసినట్లు కనిపించేలా రూపొందించే కృత్రిమ వీడియోలు, ఆడియోలు, చిత్రాలు, ఇతర డిజిటల్ కంటెంట్‌ను డీప్‌ఫేక్‌లుగా పిలుస్తారు.ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధునాతన AI సాంకేతికతతో వాయిస్ క్లోనింగ్, కృత్రిమ వీడియో కాల్స్, AI రూపొందించిన కంటెంట్ ద్వారా వ్యక్తుల గొంతు, మాట్లాడే విధానం, రూపాన్ని కూడా నమ్మశక్యం కాని రీతిలో అనుకరించే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com