ఒమన్‌లో త్వరలో ‘కన్స్యూమర్ పాస్‌పోర్ట్’ సర్వీస్..!!
- August 12, 2026
మస్కట్: వినియోగదారులకు మరింత సులభంగా సేవలు అందించేందుకు ఒమన్ వినియోగదారుల రక్షణ అథారిటీ (CPA) కొత్త డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను తీసుకురానుంది. ‘కన్స్యూమర్ పాస్‌పోర్ట్’ పేరుతో రూపొందిస్తున్న ఈ సేవ ద్వారా ఒకే డిజిటల్ గుర్తింపుతో CPAకు సంబంధించిన పలు సేవలను వినియోగదారులు పొందే అవకాశం కల్పించనున్నారు.
వినియోగదారుల ఫిర్యాదులు, నివేదికలు, వివిధ సేవలు, అలర్ట్‌లను ఒకే డిజిటల్ ఖాతాలోకి తీసుకురావడం ఈ కొత్త ప్లాట్‌ఫామ్ ద్వారా అందించనున్నారు. CPA తన సోషల్ మీడియా వేదికల ద్వారా ఈ కొత్త సేవను ప్రకటించింది. వినియోగదారులకు ఇది “పూర్తిగా భిన్నమైన అనుభవం” అందిస్తుందని పేర్కొంది. ప్రస్తుతం ప్రచార సామగ్రిలో ‘త్వరలో అందుబాటులోకి’ అని పేర్కొన్నప్పటికీ.. అధికారికంగా ఎప్పుడు ప్రారంభిస్తారనే తేదీని మాత్రం CPA వెల్లడించలేదు.
కొత్త విధానంలో వినియోగదారులు తమ వ్యక్తిగత ప్రొఫైల్‌ను యాక్సెస్ చేసి, CPAతో తమకు సంబంధించిన అన్ని వ్యవహారాలను ఒకే డిజిటల్ గుర్తింపు ద్వారా నిర్వహించుకోవచ్చు. వివిధ సేవల కోసం వేర్వేరు ఛానళ్లు, విధానాలను అనుసరించాల్సిన అవసరాన్ని తగ్గించడంతో పాటు సేవలను వేగంగా పొందే అవకాశం కల్పించనున్నారు. వినియోగదారులకు సంబంధించిన సేవలు, సమాచారం, డేటాను ఒకే చోట అందుబాటులోకి తీసుకురావడం ద్వారా సేవలను మరింత సులభంగా, పారదర్శకంగా మార్చాలని CPA లక్ష్యంగా పెట్టుకుంది.
తాజా వార్తలు
- అబుదాబి మాల్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ సందర్శన
- జెన్‌జీ ఎఫెక్ట్‌తో కొత్త పార్టీ.. నేతాజీ వారసుడి సంచలన ప్రకటన
- సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన షెడ్యూల్ ఖరారు
- కువైట్‌లో ఆగస్టు 27న ప్రభుత్వ సెలవు..!!
- ఎండలో కార్మికుడు కుప్పకూలితే ఏం చేయాలి? బహ్రెయిన్‌లో ప్రత్యేక శిక్షణ..!!
- ఒమన్‌లో త్వరలో ‘కన్స్యూమర్ పాస్‌పోర్ట్’ సర్వీస్..!!
- 183కి పైగా దేశాల్లో యూఏఈ ‘జైవాన్’ కార్డుల వినియోగం..!!
- డీప్‌ఫేక్‌లపై ఖతార్ హోంశాఖ హెచ్చరిక..!!
- రెస్టారెంట్లలో ఉల్లంఘనలపై కెమెరాలతో నిఘా..!!
- న్యాయ వ్యవస్థలో వేగం కోసం అన్ని విభాగాల సమన్వయం అవసరం: డీజీపీ సీవీ ఆనంద్







