కువైట్‌లో ఆగస్టు 27న ప్రభుత్వ సెలవు..!!

- August 12, 2026 , by Maagulf
కువైట్‌లో ఆగస్టు 27న ప్రభుత్వ సెలవు..!!

కువైట్ : ప్రవక్త మహ్మద్ జన్మదినం సందర్భంగా ఆగస్టు 27న అధికారిక సెలవు దినంగా కువైట్ కేబినెట్ ప్రకటించింది.  ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలు, పబ్లిక్ బాడీలు, ఇతర ప్రభుత్వ విభాగాలకు ఇది వర్తించనుంది. 1448 హిజ్రీ సంవత్సరంలో ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేబినెట్ వెల్లడించింది.
ఆగస్టు 27న గురువారం సెలవు కావడంతో పాటు.. ఆ తర్వాత శుక్ర, శని వారాలు సాధారణ వారాంతపు సెలవులు కావడంతో ప్రభుత్వ ఉద్యోగులకు మూడు రోజుల వరుస సెలవు లభించనుంది. ఆగస్టు 30, ఆదివారం నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో సాధారణ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతాయి.

ప్రత్యేక స్వభావం కలిగిన లేదా నిరంతరాయంగా పనిచేయాల్సిన ప్రభుత్వ సంస్థలు, విభాగాలు తమ అవసరాలకు అనుగుణంగా సెలవు ఏర్పాట్లను స్వయంగా నిర్ణయించుకోవచ్చని కేబినెట్ తెలిపింది. అయితే ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారుల సమన్వయంతో ఈ నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com