దుబాయిలో భారత కాన్సుల్ జనరల్‌ను కలిసిన GWAC కార్యవర్గం
- August 12, 2026
దుబాయి: దుబాయిలో భారత కాన్సులేట్‌కు నూతన కన్సుల్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన తెలంగాణకు చెందిన డా.ఇమ్మడి విష్ణు వర్ధన్ రెడ్డిని Gulf Workers Awareness Center (GWAC) కార్యవర్గం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపింది.
ఈ సందర్భంగా GWAC ప్రతినిధులు కన్సుల్ జనరల్‌కు వినతిపత్రం అందజేసి, దుబాయి, నార్తర్న్ ఎమిరేట్స్‌లో తెలంగాణ గల్ఫ్ కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను వివరించారు. ముఖ్యంగా తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాలకు వస్తున్న బ్లూ కాలర్ కార్మికులకు ముందస్తు అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు.
గల్ఫ్ కార్మికుల సమస్యలపై ప్రత్యేక చర్చ
గల్ఫ్‌కు వచ్చే తెలంగాణ కార్మికుల్లో గుల్ఫారం/గుట్కా వంటి పొగాకు పదార్థాల అలవాట్లకు సంబంధించిన సమస్యలు, వాటి వల్ల ఎదురవుతున్న ఆరోగ్య ఇబ్బందులను GWAC ప్రతినిధులు కన్సుల్ జనరల్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను సవివరంగా తెలుసుకున్న డా. ఇమ్మడి విష్ణు వర్ధన్ రెడ్డి, ఈ అంశాలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
అలాగే దుబాయిలోని కొన్ని డీ-అడిక్షన్ కేంద్రాలతో కూడా చర్చలు జరుపుతున్నామని, అవసరమైన వారికి ఇక్కడ వైద్య సహాయం అందించే అవకాశాలపై దృష్టి సారిస్తామని ఆయన పేర్కొన్నారు.
గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక ఆసుపత్రి
గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రి నిర్మించే అంశంపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో ఆసుపత్రి కోసం భూ కేటాయింపు ప్రక్రియ త్వరలో పూర్తవుతుందని, అనంతరం నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని కన్సుల్ జనరల్ తెలిపారు.
తెలంగాణ గల్ఫ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై మరోసారి పూర్తిస్థాయి సమావేశం నిర్వహించి, సమస్యలను ప్రాధాన్యత క్రమంలో చర్చించి, పరిష్కారానికి ఒక కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుదామని డా.ఇమ్మడి విష్ణు వర్ధన్ రెడ్డి సూచించారు.
తెలంగాణ అధికారుల నియామకంపై GWAC హర్షం
ఎంబసీ, కాన్సులేట్లలో తెలుగు అధికారులు ఉండేలా గతంలో GWAC తరఫున చేసిన ప్రయత్నాలను ఈ సందర్భంగా ప్రతినిధులు గుర్తుచేశారు. తమ ఆకాంక్ష నెరవేరి, తెలంగాణ ప్రాంతానికి చెందిన అధికారి దుబాయి భారత కాన్సుల్ జనరల్‌గా నియమితులవడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు.
డా. ఇమ్మడి విష్ణు వర్ధన్ రెడ్డి పదవీకాలంలో తెలంగాణ గల్ఫ్ కార్మికులకు సేవలందించేందుకు, వారి సమస్యల పరిష్కారానికి GWAC ఎల్లప్పుడూ తమ సహకారం అందిస్తుందని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కృష్ణ దోనికేని తెలిపారు.
ఈ సమావేశంలో కృష్ణ దోనికేని, శ్రీనివాస్ రెండ్ల, నరేందర్ గడ్చంద, అనిల్ కుమార్ కటుకం, మోతే రాములు, సతీష్ దారం, నరేష్ కల్లెడ, బాబు బోస, సముద్రాల శ్రీనివాస్, మల్లేష్ గౌడ్, శంకర్ లౌడ్య, సుమన్ చింతన్ పల్లి, శ్రీనివాస్ ఎలకపల్లి పాల్గొన్నారు.



తాజా వార్తలు
- ఖతార్‌లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!ఖతార్‌లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!
- భారతీయులకు అబుదాబి ఉచిత టూరిస్ట్ వీసా..11 ట్రావెల్ ఏజెన్సీలు ఇవే..!!
- బర్త్ టూరిజం పై అమెరికా కఠిన చర్యలు..
- కువైట్‌లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త నిబంధనలు..!!
- ఆంధ్రప్రదేశ్‌లో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడి..రూ.16,000 కోట్ల టైటానియం ప్లాంట్
- సౌదీలో విరాళాల సేకరణ.. పిల్లలను ఉపయోగించడంపై నిషేధం..!
- ధోఫార్‌లో ‘ఎయిర్ స్పోర్ట్స్ విలేజ్’ ప్రారంభం..!!
- డయాబెటిక్ తో బాధపడుతున్న చిన్నారులకు కమ్యూనిటీ సపోర్ట్..!!
- BITS పిలానీ గోవా క్యాంపస్‌లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..







