ఖతార్‌లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!ఖతార్‌లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!

- August 13, 2026 , by Maagulf
ఖతార్‌లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!ఖతార్‌లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!

దోహా: మెత్రాష్ (Metrash) వినియోగదారులకు ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) కీలక సమాచారాన్ని వెల్లడించింది. ఇకపై Metrash యూజర్లు తమ భార్య, పిల్లలు వంటి కుటుంబ సభ్యులను డెలిగేట్ చేసి, వారు తమ సొంత ఫోన్లలో Metrash యాప్‌ను యాక్టివేట్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. కుటుంబ సభ్యుల వద్ద ఖతార్ మొబైల్ నంబర్ లేకపోయినా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు.

ఈ సేవను వినియోగించాలంటే Metrash యాప్‌లోని ప్రధాన మెనూలో ‘Delegation’ ఎంపికను ఎంచుకుని, అనంతరం ‘Relative Registration’ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత కుటుంబ సభ్యుడి QID నంబర్, QID గడువు తేదీ, రిజిస్ట్రేషన్ కోసం ఉపయోగించాల్సిన మొబైల్ నంబర్ వంటి వివరాలను నమోదు చేసి ‘Add’ పై క్లిక్ చేయాలి.
వివరాలు నమోదు చేసిన అనంతరం సంబంధిత కుటుంబ సభ్యుడికి అనుమతి లభిస్తుంది. దీంతో వారు పేర్కొన్న మొబైల్ నంబర్‌ను ఉపయోగించి తమ ఫోన్‌లో Metrash యాప్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ సదుపాయం ముఖ్యంగా ఖతార్‌లో స్వంత మొబైల్ నంబర్ లేని కుటుంబ సభ్యులకు ఉపయోగకరంగా ఉంటుందని MoI తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com