సలాలాలో ఒమన్ ట్రెడిషనల్ గేమ్స్ సీజన్‌ 2026 ప్రారంభం..!!

- August 14, 2026 , by Maagulf
సలాలాలో ఒమన్ ట్రెడిషనల్ గేమ్స్ సీజన్‌ 2026 ప్రారంభం..!!

సలాలా: ఒమన్‌ ట్రెడిషనల్ గేమ్స్ సీజన్‌ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. ధోఫార్‌ గవర్నరేట్‌లోని సలాలా అల్‌ దహారిజ్‌ బీచ్‌లో మూడు రోజుల క్రీడా ఉత్సవాన్ని ప్రారంభించారు. ఖరీఫ్‌ ధోఫార్‌ (వర్షాకాలం) సీజన్‌ను పురస్కరించుకుని ఒమన్‌ సాంస్కృతిక, క్రీడలు, యువజన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఒమన్‌ సంప్రదాయ క్రీడలు, ఆటలపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు.. ధోఫార్‌ గవర్నరేట్‌కు వచ్చే పర్యాటకులకు దేశ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని పరిచయం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.

ఖరీఫ్‌ సీజన్‌లో సలాలాకు వచ్చే పర్యాటకులను ఆకర్షించేలా పలు క్రీడా, వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ధోఫార్‌ గవర్నరేట్‌ క్లబ్స్‌ ఛాంపియన్‌షిప్‌ ఫర్‌ ఒమానీ ట్రెడిషనల్‌ గేమ్స్‌ నిర్వహిస్తున్నారు. అలాగే పిల్లలకు ఒమన్‌ సంప్రదాయ ఆటలను స్వయంగా ఆడే అవకాశం కల్పించేందుకు వర్చువల్‌ రియాలిటీ (VR) సాంకేతికతతో ప్రత్యేక ఇంటరాక్టివ్‌ వేదికను ఏర్పాటు చేశారు. సంప్రదాయ ఆటలు, క్రీడలకు సంబంధించిన ఫొటోలు, పెయింటింగ్స్‌, వివిధ ప్రదర్శనలతో కూడిన చిన్న ఎగ్జిబిషన్‌ను కూడా సందర్శకుల కోసం ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com