సంక్రాంతి రేసులో ‘జార్జ్ క్రిష్’..!!
- August 14, 2026
యంగ్ హీరో శర్వానంద్ మరియు స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న నూతన చిత్రం ‘జార్జ్ క్రిష్’ అధికారికంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాలతో షూటింగ్‌ను మొదలుపెట్టిన మేకర్స్, ఈ సందర్భంగా సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. అంతటితో ఆగకుండా, ఈ చిత్రాన్ని 2027 జనవరి 14న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. పూర్తిస్థాయి లవ్ అండ్ ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతి రేసులో సరికొత్త వినోదాన్ని పంచేందుకు సిద్ధమవుతోంది.
శ్రీను వైట్ల రీ-ఎంట్రీ ప్రయత్నం.. శర్వానంద్ ‘సంక్రాంతి సెెంటిమెంట్’!
గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక సతమతమవుతున్న దర్శకుడు శ్రీను వైట్లకు ఈ సినిమా అత్యంత కీలకమైనదిగా మారింది. తన మార్క్ టైమింగ్, కామెడీతో ఈ చిత్రంతో మళ్లీ గ్రాండ్ సక్సెస్ ట్రాక్‌లోకి వస్తారని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరోవైపు కథానాయకుడు శర్వానంద్‌కు సంక్రాంతి సీజన్ బాగా కలిసివచ్చిన సెంటిమెంట్ అని చెప్పవచ్చు. గతంలో పండగ రేసులో వచ్చిన ‘శతమానం భవతి’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’, ‘నారీ నారీ నడుమ మురారి’ వంటి చిత్రాలతో భారీ విజయాలను అందుకున్న శర్వా, ‘జార్జ్ క్రిష్’ తో మరోసారి బాక్సాఫీస్ వద్ద విజేతగా నిలవాలని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







