వక్కంత వంశీ దర్శకత్వంలో ఎన్టీఆర్ ..
- August 17, 2016
ఎన్టీఆర్ తన చిత్రాల వేగాన్ని పెంచేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది ఇప్పటికే 'నాన్నకు ప్రేమతో' అంటూ అభిమానులను పలకరించగా, తాజాగా సెప్టెంబర్ 2న 'జనతా గ్యారేజ్'తో అభిమానులను అలరించేందుకు వస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సమంత, నిత్యామేనన్ కథానాయికలు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. ఇక రచయిత వక్కంత వంశీ దర్శకత్వంలో ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని చేయనున్నారు. ఈ చిత్ర షూటింగ్ అక్టోబర్‌లో ప్రారంభంకానుందట. వంశీ చెప్పిన కథ నచ్చడంతో ఎన్టీఆర్ పచ్చజెండా వూపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తికావచ్చాయని సమాచారం. గతంలో ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన అశోక్, వూసరవెల్లి, టెంపర్ చిత్రాలకు వంశీనే రచయితగా పనిచేశారు. తాజా చిత్రాన్ని ఎన్.టి.ఆర్. ఆర్ట్స్ పతాకంపై కల్యాణ్‌రామ్ నిర్మించనున్నారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







