యూఏఈలో కొనసాగుతున్న ఎండల తీవ్రత..వర్షాలు పడే అవకాశం..!!

- August 18, 2026 , by Maagulf
యూఏఈలో కొనసాగుతున్న ఎండల తీవ్రత..వర్షాలు పడే అవకాశం..!!

యూఏఈ: యూఏఈలో నేడు వాతావరణం సాధారణంగా పాక్షిక మేఘావృతంగా ఉండే అవకాశం ఉందని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటీరాలజీ (NCM) తెలిపింది. మధ్యాహ్నం తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో వర్షాన్ని సూచించే మేఘాలు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఆగ్నేయం నుంచి ఈశాన్య దిశగా గంటకు 40 కిలోమీటర్ల వేగంతో తేలికపాటి నుంచి మోస్తరు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.  

మరోవైపు యూఏఈలో వేసవి తీవ్రత కొనసాగుతోంది. అబుదాబిలో గరిష్ఠ ఉష్ణోగ్రత 46 డిగ్రీల సెల్సియస్‌కు, దుబాయ్‌, షార్జాలో 45 డిగ్రీల వరకు చేరే అవకాశం ఉంది. ఆయా ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 32, 34, 31 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. ఆగస్టు 24న సుహైల్ నక్షత్రం ఉదయించడంతో యూఏఈలో గరిష్ఠ వేసవి కాలం క్రమంగా ముగిసే దశ ప్రారంభమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గకుండా.. రానున్న రోజుల్లో క్రమంగా తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com