ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- August 26, 2026
మనామా: స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన నిధుల దుర్వినియోగం, నకిలీ పత్రాల సృష్టి, నేరం ద్వారా వచ్చిన సొమ్మును చట్టబద్ధంగా చూపించే ప్రయత్నం చేసిన కేసులో జాఫర్ ఔక్ఫ్ డైరెక్టరేట్‌కు చెందిన 45 ఏళ్ల విభాగాధిపతికి హై క్రిమినల్ కోర్టు 22 ఏళ్ల జైలు శిక్ష విధించింది. నిందితుడు చారిటబుల్ ఎండోమెంట్స్ అండ్ వెల్ఫేర్ కమిటీ సమన్వయకర్తగా పనిచేస్తూ, పేదలు, అవసరంలో ఉన్న వారికి అందించాల్సిన సహాయ నిధుల చెక్కులను తన వ్యక్తిగత అవసరాలకు మళ్లించినట్లు దర్యాప్తులో తేలింది.
లబ్ధిదారుల పేర్లను ఉపయోగించడం లేదా నకిలీ పేర్లతో చెక్కులు పొందడం ద్వారా నిధులను స్వాహా చేసినట్లు అధికారులు గుర్తించారు. ఆ డబ్బును వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాలు కొనుగోలు చేయడంతో పాటు రుణాలు, క్రెడిట్ కార్డు బకాయిల చెల్లింపులకు వినియోగించినట్లు కోర్టుకు సమర్పించిన ఆధారాలు వెల్లడించాయి. అంతేకాకుండా, పలువురు మహిళలు.. ముఖ్యంగా వితంతువులు, విడాకులు పొందిన మహిళల బ్యాంకు ఖాతాలను వారి అనుమతి లేకుండా నిధుల బదిలీకి ఉపయోగించినట్లు దర్యాప్తులో బయటపడింది.
నిందితుడికి BD160,000 వడ్డీలేని రుణం మంజూరైనట్లు చూపించే నకిలీ లేఖను కూడా ఆధారంగా కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే ఆ లేఖ, దానిపై ఉన్న సంతకం అసలైనవి కావని జాఫర్ ఔక్ఫ్ కౌన్సిల్ చైర్మన్ ధృవీకరించారు. కోర్టు నిందితుడు BD483,107.710 మొత్తాన్ని తిరిగి చెల్లించాలని, BD100,000 జరిమానా విధించింది. మనీలాండరింగ్ నేరంతో సంబంధం ఉన్న BD414,878.740 మొత్తాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు, నకిలీ పత్రాలు మరియు నేరం ద్వారా సంపాదించిన ఆస్తులకు సమానమైన ఆస్తులను కూడా జప్తు చేయాలని ఆదేశించింది.
పలు చెక్కులు బ్యాంకులు, కంపెనీలకు జారీ కావడంపై అధికారులకు అనుమానాలు రావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అనంతరం నిర్వహించిన ఆడిట్, దర్యాప్తులో భారీగా నిధుల దుర్వినియోగం జరిగినట్లు తేలింది.
తాజా వార్తలు
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..







