సినిమా రివ్యూ: ‘టాక్సిక్’

- August 26, 2026 , by Maagulf
సినిమా రివ్యూ: ‘టాక్సిక్’

‘కేజీఎఫ్’సినిమాతో తిరుగులేని స్టార్డమ్ సంపాదించుకున్న హీరో యష్. దాదాపు నాలుగేళ్ల తర్వాత మళ్లీ ‘టాక్సిక్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ సినిమాలో యష్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌ కాగా, నయనతార, తారా సుతారియా, హ్యూమా ఖురేషి, రుక్మిణీ వసంత్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ట్రైలర్లు, టీజర్లతో మోెత మోగించిన టాక్సిక్ సినిమాకి ప్రేక్షకుల నుంచి ఎలాంటి మెప్పు అందిందో తెలుసుకోవాలంటే సినిమా కథలోకి వెళ్లాల్సిందే.

కథ:
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా గోవా ఇంకా పోర్చుగీసు వారి చేతుల్లోనే వుంటుంది. ఆ టైమ్‌లో అక్కడ జరిగిన చీకటి రాజకీయాల నేపథ్యమే ఈ ‘టాక్సిక్’ సినిమా. కొన్ని ముఠా గ్యాంగ్‌ల ముసుగులో గోవాలో అనేక రకాల అక్రమాలు జరుగుతుంటాయ్. మితిమీరిన హింస, అక్రమ స్మగ్లింగులు, డ్రగ్స్ మాఫియా.. ఇలా ఒక్కటేమిటి అన్ని రకాల అక్రమాలు పెరిగిపోతాయ్. ఈ చీకటి సామ్రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని అక్కడి ముఠాలు పోరాడుతుంటాయ్. ఇలాంటి దారుణమైన ఆధిపత్య పోరు నడుస్తున్న ప్రపంచంలో రాయ (యష్) ఎందుకు ఉండాల్సి వచ్చింది.? ఈ పోరును తట్టుకుని ఆ ప్రపంచంలో ఎలా ఎదిగాడు.? రాయ రామిగా (డ్యూయల్ రోల్ యష్) ఎందుకు మారాడు.? గంగ (నయనతార)కీ, రాయకీ సంబంధం ఏంటీ.? ఆమెతో ఎందుకు పోరాటం చేయాల్సి వచ్చింది. నాడియా (కియారా)తో రాయ ప్రేమాయణం ఎలా సాగింది.? ఎలిజిబెత్ (హ్యూమా ఖురేషి), రెబెకా (తారా సుతారియా), మెలిసా (రుక్మిీణీ వసంత్) పాత్రలతో రాయకి లింకేంటీ.? ఈ విషయాలన్నీ  తెలియాలంటే ‘టాక్సిక్ ది ఫెయిరీ టేల్స్ ఫర్  గ్రోన్ అప్స్’ సినిమా ధియేటర్లలో చూడాల్సిందే.

నటీనటుల పని తీరు:
మూడు రకాల వేరియేషన్స్ వున్న పాత్రల్లో యష్ విశ్వరూపం చూపించాడు. స్క్రీన్ ప్రెజెన్స్ చితక్కొట్టేశాడు. పర్‌ఫామెన్స్ కూడా. యాక్షన్ సీన్లతో పాటూ ఎమోషన్స్ అలాగే ఇంటెన్స్ సీన్లలోనూ యష్ సూపర్బ్ పర్‌ఫామెన్స్ ఇచ్చాడు. యష్ తర్వాత నయన తార పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత వుంది. గంగ పాత్రలో నయన తార చాాలా డిగ్నిఫైడ్‌గా ఎలిగెంట్ లుక్స్‌తో కనిపించింది. అలాగే చాలా కాన్ఫిడెంట్‌గా పర్‌ఫామెన్స్ ఇచ్చింది. యష్ - నయనతార కాంబినేషన్ సీన్లు.. డైలాగులు చాలా చక్కగా పండాయ్.. కియారా అద్వానీ చాలా హాట్‌గా కనిపించింది. కొన్ని చోట్ల మితిమీరిన శృంగారంతో మెప్పించింది. తారా సుతారియా, హ్యూమా ఖురేషి, మిగిలిన పాత్రధారులు తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు. 

సాంకేతిక వర్గం పనితీరు:
గీతూ మోహన్ దాస్ ఈ సినిమాని చాలా బోల్డ్‌గా తెరకెక్కించింది. హాలీవుడ్ రేంజ్ విజువల్స్ ఈ సినిమాని నెక్స్‌ట్ లెవల్‌కి తీసుకెళ్లాయ్. యష్, గీతూ మోహన్ దాస్ కలిసి రాసుకున్న కథ ఓకే. కానీ, కథనం నడిపించడంలో చాలా కన్‌ఫ్యూజింగ్‌గా అనిపిస్తుంది. ఫస్టాఫ్ అంతా పాత్రల పరిచయం, బోల్డ్ సన్నివేశాలు.. సెకండాఫ్‌లో యాక్షన్ విపరీతమైన యాక్షన్.. రవి బస్రూర్ నేపథ్య సంగీతంపై మిశ్రమ అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయ్. ఎడిటింగ్ బాగుందంటే బాగుంది. క్లమ్‌జీ అంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. పాత్రలు ఎక్కువయిపోవడం వల్ల కూడా ఆ కన్‌ఫ్యూజ్‌కి ఓ కారణంగా మాట్లాడుతున్నారు. విజెవల్స్ అయితే చాలా బాగున్నాయ్. క్వాలిటీ చాలా బాగుంది. నిర్మాణంలో ఎక్కడా రాజీ పడలేదని సినిమాని స్క్రీన్‌పై చూస్తే ఆ వర్త్ అర్ధమవుతుంది. 

ప్లస్ పాయింట్స్:
యష్ పర్‌ఫామెన్స్, యాక్షన్ ఘట్టాలు, హాలీవుడ్ రేంజ్ విజువల్స్..

మైనస్ పాయింట్స్:
మితిమీరిన శృంగార సన్నివేశాలు, హింస, లెంగ్తీ రన్ టైమ్... 

చివరిగా:
‘టాక్సిక్’  భిన్న అభిప్రాయాలున్నాయ్. బోల్డ్ యాక్షన్ టాక్సిక్..ఏ వేరియేషన్ సినిమాని సక్సెస్ బాట వైపు నడిపిస్తుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com