నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- August 29, 2026
అబుదాబి: అద్దె చెల్లింపు పేరుతో మోసానికి పాల్పడిన వ్యక్తికి అబుదాబి కోర్టు షాక్ ఇచ్చింది. నకిలీ బ్యాంకు ఖాతాకు అద్దె డబ్బులు బదిలీ చేయించిన కేసులో.. బాధితుడికి Dh42,500 (సుమారు రూ.10.5 లక్షలు) తిరిగి చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
అసలు ఏం జరిగిందంటే.. ఓ కంపెనీకి చెందిన ప్రాపర్టీలో అద్దెకు ఉంటున్న వ్యక్తి లీజ్‌ను పునరుద్ధరించుకునేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఓ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ పంపిన వ్యక్తి తాను ప్రాపర్టీ కంపెనీ ఉద్యోగినని చెప్పుకున్నాడు. రెంట్ చెల్లించేందుకు ఓ బ్యాంకు ఖాతా వివరాలను పంపించాడు.
ఆ వ్యక్తి కంపెనీ అధికార ప్రతినిధి అని నమ్మిన అద్దెదారు.. సూచించిన బ్యాంకు ఖాతాకు Dh42,500 బదిలీ చేశాడు. అయితే ఆ తర్వాత ఆ బ్యాంకు ఖాతా ప్రాపర్టీ కంపెనీకి చెందినది కాదని తెలుసుకున్నాడు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారంపై జరిగిన క్రిమినల్ కేసులో నిందితుడు దోషిగా తేలాడు. క్రిమినల్ కేసు అనంతరం తనకు జరిగిన ఆర్థిక నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు బాధితుడు అబుదాబి ఫ్యామిలీ, సివిల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ క్లెయిమ్స్ కోర్టును ఆశ్రయించాడు. తాను బదిలీ చేసిన Dh42,500 మొత్తాన్ని పూర్తిగా తిరిగి చెల్లించాలని నిందితుడిని కోరాడు. అంతేకాకుండా మోసం కారణంగా తనకు కలిగిన ఆర్థిక, మానసిక, ఇతర నష్టాలకు పరిహారంగా మరో Dh10,000 చెల్లించాలని కోరాడు. కేసు దాఖలు చేసిన తేదీ నుంచి మొత్తం చెల్లించే వరకు 10 శాతం చట్టపరమైన వడ్డీ కూడా ఇవ్వాలని విజ్ఞప్తి చేశాడు. కేసును విచారించిన సివిల్ కోర్టు.. ఇదే వ్యవహారంపై గతంలో జరిగిన క్రిమినల్ విచారణలో నిర్ధారించిన అంశాలను పరిగణనలోకి తీసుకుంది. క్రిమినల్ కోర్టు ఇప్పటికే నిర్ధారించిన మోసం సంబంధిత అంశాలను సివిల్ కోర్టులో మళ్లీ విచారించాల్సిన అవసరం లేదని పేర్కొంది. బాధితుడు బదిలీ చేసిన Dh42,500ను తిరిగి చెల్లించాలని నిందితుడిని కోర్టు ఆదేశించింది.
అద్దెదారులకు కీలక హెచ్చరిక
మెసేజ్‌లు, వాట్సాప్ లేదా ఇతర మార్గాల ద్వారా వచ్చే రెంట్ పేమెంట్ సూచనలను వెంటనే నమ్మి డబ్బులు బదిలీ చేయవద్దని ఈ ఘటన హెచ్చరిస్తోంది. ముఖ్యంగా బ్యాంక్ ఖాతా వివరాలను ల్యాండ్‌లార్డ్ లేదా ప్రాపర్టీ మేనేజ్మెంట్ కంపెనీతో మాట్లాడి ధృవీకరించుకున్న తర్వాతే అద్దె చెల్లించడం సురక్షితం అని తెలియజేస్తోంది.
తాజా వార్తలు
- ఖతార్‌లో విద్యార్థులకు హీట్‌వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్‌లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్‌లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్‌లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ







