కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!

- August 29, 2026 , by Maagulf
కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!

కువైట్: ఇంటి నుంచే అనుమతి లేని ఇంజెక్షన్ సేవలు అందిస్తున్నారన్న ఆరోపణలపై ఓ మహిళా డాక్టర్ ను అధికారులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో అనుమతి లేని వైద్య పదార్థాలతో ఇంజెక్షన్ సేవలు అందిస్తున్నట్లు ప్రకటనలు చేసినట్లు అధికారులు గుర్తించారు.

కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ (PAM)కు చెందిన లేబర్ ఇన్‌స్పెక్షన్ విభాగం చేపట్టిన తనిఖీలు, పర్యవేక్షణలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. జనరల్ ప్రాక్టీషనర్‌గా పనిచేస్తున్న సదరు వైద్యురాలు అల్-మసాయెల్ ప్రాంతంలోని తన ఇంటి నుంచి ఈ సేవలు అందిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

ఈ వ్యవహారంపై PAM.. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ క్రిమినల్ సెక్యూరిటీ సెక్టార్, ఆరోగ్య మంత్రిత్వ శాఖ మెడికల్ లైసెన్సింగ్ విభాగం, డ్రగ్ ఇన్‌స్పెక్షన్ విభాగాలతో సమన్వయం చేసింది. సంబంధిత అధికారుల నుంచి అవసరమైన అనుమతులు పొందిన అనంతరం మహిళా వైద్యురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై చట్టపరమైన, పరిపాలనా చర్యలు ప్రారంభించి.. తదుపరి చర్యల కోసం సంబంధిత అధికారులకు అప్పగించారు.

కార్మిక మార్కెట్, వృత్తిపరమైన కార్యకలాపాలకు సంబంధించిన చట్టాలు, నిబంధనలను ఉల్లంఘించే వ్యవహారాలను గుర్తించేందుకు తనిఖీలు, పర్యవేక్షణ కొనసాగిస్తామని PAM స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com