‘ధర్మస్థల నియోజకవర్గం’ ట్రైలర్ రిలీజ్..
- August 29, 2026
మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై మేరుం భాస్కర్ నిర్మాణంలో జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ధర్మస్థల నియోజకవర్గం. సుమన్, సాయికుమార్, నటరాజ్, రాయంచ కొక్కుర, వితికా షేరు.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పొలిటికల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ధర్మస్థల నియోజకవర్గం సినిమా సెప్టెంబర్ 4న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నిర్మాత మేరుం భాస్కర్ మాట్లాడుతూ.. ముందుగానే అనుకున్నట్లుగా 45 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసి పర్ఫెక్ట్ అవుట్ పుట్ తీసుకొచ్చాం అని తెలిపారు. హీరోయిన్ వితికా షేరు మాట్లాడుతూ.. ఈ సినిమాలోని పాటలు విన్న తర్వాతే కథ విన్నాను. ఇన్నాళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చాను. ఈ సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్ వచ్చింది కాబట్టే ఒప్పుకున్నాను అని తెలిపారు.
డైరెక్టర్ జై జ్ఞాన ప్రభ మాట్లాడుతూ,, మా సినిమాలో మంచి కథతో పాటు మంచి సాంగ్స్ కూడా కుదిరాయి. నీరంతా భాస్కర్ గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను రూపొందించారు. ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏమాత్రం నిరాశపర్చదు అని అన్నారు. నటుడు నటరాజ్ మాట్లాడుతూ.. డైరెక్టర్ జ్ఞాన ప్రభ గారు గతంలో నాలుగైదు సినిమాలు చేసి మాకు చెప్పకుండా దాచారేమో అనిపిస్తోంది. అంత అనుభవం ఉన్న దర్శకుడిలా ఈ సినిమాను రూపొందించారు. వితిక, శివకుమార్ కాంబినేషన్ లో నాకు ఎక్కువ సీన్స్ ఉన్నాయి అని తెలిపారు.
లిరిక్ రైటర్ చంద్రబోస్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఐదు మంచి సాంగ్స్ రాసే సందర్భాలు కల్పించారు. రంగస్థలం తర్వాత నాకు పాటల పరంగా అంత సంతృప్తిని, సంతోషాన్ని కలిగించిన సినిమా ధర్మస్థల నియోజకవర్గం. నేను రాసిన పాటలకు మహావీర్ తన సంగీతంతో ప్రాణం పోశాడు. ప్రతిఘటనలో విజయశాంతికి ఎలాంటి క్యారెక్టర్ వచ్చిందో ఈ సినిమాలో వితికకు అలాంటి పవర్ ఫుల్ రోల్ లభించింది. ఆమె చుట్టూనే కథంతా తిరుగుతుంటుంది అని అన్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో విద్యార్థులకు హీట్‌వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్‌లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్‌లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్‌లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ







