యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- August 30, 2026
దుబాయ్: యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఉపాధ్యక్షుడు, ప్రధానమంత్రి, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ను దుబాయ్‌లోని అల్ మార్మూమ్లో కలిశారు.
ఈ సందర్భంగా ఇరువురు నేతలు స్నేహపూర్వకంగా చర్చలు జరిపారు. దేశ వ్యవహారాలు, పౌరుల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాల పై సమీక్ష నిర్వహించారు. యూఏఈ అభివృద్ధి ప్రస్థానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు చేపడుతున్న చర్యల పై కూడా చర్చించారు.
దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంతో పాటు, వారికి మరింత సుసంపన్నమైన, స్థిరమైన భవిష్యత్తును అందించే దిశగా కొనసాగుతున్న ప్రయత్నాలపై ఇరువురు నేతలు అభిప్రాయాలను పంచుకున్నారు.
ఈ సమావేశంలో యూఏఈ అధ్యక్షుడి సలహాదారు షేక్ మొహమ్మద్ బిన్ హమద్ బిన్ తహ్నూన్ అల్ నహ్యాన్తో పాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







