చిరంజీవి 150వ సినిమా ఫస్ట్‌లుక్‌ ఆగస్ట్‌ 22న...

- August 19, 2016 , by Maagulf
చిరంజీవి 150వ సినిమా ఫస్ట్‌లుక్‌ ఆగస్ట్‌ 22న...

దాదాపు తొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రంపై విపరీతమైన అంచనాలున్నాయి. ఇది చిరంజీవి 150వ సినిమా కావడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. అందుకే చిరంజీవి అండ్‌ కో సకల జాగ్రత్తలూ తీసుకుని తమిళ 'కత్తి'ని రీమేక్‌ చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిరంజీవి పుట్టిన రోజు అయిన ఆగస్ట్‌ 22న విడుదల చేయనున్నారు. ఆ విషయం తెలియజేయడానికి గురువారం రాత్రి ఓ ప్రీ-లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. అయితే అందులో కూడా ఈ సినిమా పేరేంటన్నది వెల్లడించలేదు. కేవలం 'కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ' అనే బ్యానర్‌ను, హైదరాబాద్‌ సింబల్స్‌ అయిన చార్మినార్‌, బుద్ధ విగ్రహం, గోల్కొండ కోట చూపించారు.
ఈ సినిమా పేరేంటో తెలియాలంటే ఆగస్ట్‌ 22వ తేదీ వరకు ఆగక తప్పదన్నమాట

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com